అమెరికా అసోసియేట్ ఏజీగా ఎంపికైన భారత సంతతి మహిళ?
Sakshi Education
అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా ప్రముఖ పౌర హక్కుల మహిళా న్యాయవాది, భారతీయ మూలాలున్న వనితా గుప్తా ఎంపికయ్యారు.
వనిత ఎంపికను ఖరారు చేస్తూ... అమెరికా సెనేట్ ఏప్రిల్ 22న నిర్ణయం తీసుకుంది. 51–49 ఓట్లతో వనిత ఎంపిక ఖాయమైంది. అమెరికా న్యాయశాఖ విభాగంగా మూడో అత్యున్నత పదవి అయిన అసోసియేట్ అటార్నీ జనరల్‌గా శ్వేతజాతీయేతర వ్యక్తి ఎంపికకావడం ఇదే తొలిసారి. ఈ పదవికి ఎంపికైన తొలి పౌర హక్కుల లాయర్ కూడా వనితనే.
వనిత 28 ఏళ్ల వయసులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. బరాక్ ఒబామా హయాంలో పౌర హక్కులకు సంబంధించి అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా విధులు నిర్వర్తించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా అసోసియేట్ ఏజీగా ఎంపికైన భారత సంతతి మహిళ?
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : వనితా గుప్తా
ఎక్కడ : అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా అసోసియేట్ ఏజీగా ఎంపికైన భారత సంతతి మహిళ?
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : వనితా గుప్తా
ఎక్కడ : అమెరికా
Published date : 23 Apr 2021 06:17PM