ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకా పేరు?
Sakshi Education
కోవిడ్-19పై ఏర్పాటైన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కి చెందిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (సీఎస్‌వో)... ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ‘‘కోవిషీల్డ్’’ అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయడానికి జనవరి 1న సిఫారసు చేసింది.
18 ఏళ్లు దాటిన వారికి 4- 6 వారాల మధ్యలో రెండు డోసుల్లో వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించింది. డ్రగ్‌స కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) దీనికి ఇంకా తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను పుణేకి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది. ఆక్స్‌ఫర్డ్ టీకా వినియోగానికి ఇప్పటికే బ్రిటన్, అర్జెంటీనా దేశాలు అనుమతులు ఇచ్చాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : సెంట్రల్ గ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కి చెందిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (సీఎస్‌వో)
ఎందుకు : కోవిడ్‌ను నిరోధించేందుకు

Published date : 02 Jan 2021 05:49PM