ఐటీఎఫ్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత క్రీడాకారిణి?
Sakshi Education
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి వేదరాజు ప్రపూర్ణ రన్నరప్‌గా నిలిచింది.
జింబాబ్వేలో డిసెంబర్ 21న జరిగిన ఈ టోర్నీలో బాలికల సింగిల్స్ ఫైనల్లో ప్రపూర్ణ 5-7, 0-6తో డానిక్ హావర్‌మన్‌స (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయింది.
ప్రియాంక ఓటమి...
‘ఫిడే’ ప్రపంచ ఆన్‌లైన్ యూత్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నూతక్కి ప్రియాంక పోరాటం ముగిసింది. విజయవాడకు చెందిన ప్రియాంక అండర్-18 బాలికల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. ఎలిజవిటా సోలోజెన్‌కినా (రష్యా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రియాంక 0.5-1.5తో ఓడిపోయింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐటీఎఫ్ జూనియర్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన క్రీడాకారిణి
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : వేదరాజు ప్రపూర్ణ
ఎక్కడ : జింబాబ్వే
Published date : 22 Dec 2020 06:48PM