ఐటీఎఫ్ పురుషుల టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గిన భారత జోడీ?
Sakshi Education
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నీ డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని, యూకీ బాంబ్రీ ద్వయం విజేతగా నిలిచింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మార్చి 6న జరిగిన ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ జంట 6–2, 6–3తో కాజా వినాయక్ శర్మ–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జోడీపై గెలిచింది. ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్, భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు అయిన సాకేత్ మైనేని కెరీర్‌లో ఓవరాల్‌గా ఇది 21వ డబుల్స్ టైటిల్.
రన్నరప్ సౌజన్య జోడీ...
న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో సౌజన్య–ప్రార్థన తొంబారే (భారత్) జోడీ రన్నరప్‌గా నిలిచింది. మార్చి 6న జరిగిన డబుల్స్ ఫైనల్లో సౌజన్య–ప్రార్థన ద్వయం 2–6, 3–6తో పియా లవ్రిచ్ (స్లొవేనియా)–అడ్రియన్ నాగీ (హంగేరి) జంట చేతిలో పరాజయం పాలైంది.
ఉత్తరప్రదేశ్...
రాజధాని: లక్నో
ప్రస్తుత గవర్నర్: ఆనందీబెన్ పటేల్
ప్రస్తుత ముఖ్యమంత్రి: యోగి ఆదిత్యనాథ్
హైకోర్టు: అలహాబాద్. హైకోర్టు బెంచ్ లక్నోలో ఉంది.
లోక్‌సభ స్థానాలు: 80
రాజ్యసభ స్థానాలు: 31
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నీ డబుల్స్ విభాగంలో టైటిల్ గెలుపు
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : సాకేత్ మైనేని, యూకీ బాంబ్రీ ద్వయం
ఎక్కడ : లక్నో, ఉత్తరప్రదేశ్

Published date : 08 Mar 2021 06:03PM