Skip to main content

ఐటీఎఫ్ గ్రేడ్–5 జూనియర్ బాలికల టోర్నీ విజేత?

అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్–5 జూనియర్ బాలికల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్ల విజేతగా నిలిచింది.
Current Affairs
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మార్చి 13న ముగిసిన ఈ టోర్నీలో 16 ఏళ్ల సంజన సింగిల్స్‌ ఫైనల్లో 4–6, 6–0, 6–0తో లక్షణ్య విశ్వనాథ్‌ (భారత్‌)పై గెలిచింది. 2019 నవంబర్‌లో గువాహటిలో చివరిసారి ఆమె టైటిల్‌ సాధించింది.

పంజాబ్‌ కింగ్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా రైట్‌...
ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ డేమియన్‌ రైట్‌ను తమ కొత్త బౌలింగ్‌ కోచ్‌గా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంచైజీ పంజాబ్‌ కింగ్స్‌ నియమించుకుంది. 45 ఏళ్ల రైట్‌ ఇప్పటికే బంగ్లాదేశ్‌ అండర్‌ –19 క్రికెట్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా సేవలందిస్తున్నారు. రైట్‌ గతంలో బిగ్‌బాష్‌ లీగ్‌ జట్టు హోబర్ట్‌ హరికేన్స్, మెల్‌బోర్న్‌ స్టార్స్‌తో పాటు న్యూజిలాండ్‌ జాతీయ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్‌–2021 సీజన్‌ ఏప్రిల్‌ 9న మొదలవుతుంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఐటీఎఫ్‌ గ్రేడ్‌–5 జూనియర్‌ బాలికల టోర్నీ విజేత?
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : సంజన సిరిమల్ల
ఎక్కడ : డెహ్రాడూన్, ఉత్తరాఖండ్‌
Published date : 15 Mar 2021 06:04PM

Photo Stories