Skip to main content

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుకి అరుదైన గౌరవం దక్కింది.
Current Affairsవరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ప్రత్యేక ఆహ్వానం మేరకు జనవరి 23న జరిగిన ‘వరల్డ్ ఎకనామిక్ లీడర్స్’ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ‘సాంకేతిక అభివృద్ధి వేగాన్ని కొనసాగించడం-సాంకేతిక ఆధారిత పరిపాలన’ అనే అంశంపై ఈ సమావేశాన్ని నిర్వహించారు. సాధారణంగా ఈ సమావేశానికి ప్రభుత్వాధినేతలు, కేంద్ర ప్రభుత్వాల విధానరూపకర్తలైన సీనియర్ మంత్రులను మాత్రమే ఆహ్వానిస్తారు. ఈ సమావేశానికి హాజరైనవారిలో రాష్ట్ర మంత్రి స్థాయిలో కేటీఆర్ ఒక్కరే ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ సమావేశం
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : కె.తారక రామారావు
ఎక్కడ : దావోస్, స్విట్జర్లాండ్
ఎందుకు : సాంకేతిక అభివృద్ధి వేగాన్ని కొనసాగించడం-సాంకేతిక ఆధారిత పరిపాలన’ అనే అంశంపై చర్చించేందుకు
Published date : 24 Jan 2020 05:30PM

Photo Stories