Skip to main content

ఐసీజేఎస్ అమల్లో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న రాష్ట్రం?

ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) అమలుకు సంబంధించి కేంద్ర హోంశాఖ డిసెంబర్ 15న అవార్డులను ప్రకటించింది.
Education News
ఐసీజేఎస్ విధానం అమలు, వినియోగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన మహారాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్, మూడవ స్థానంలో తెలంగాణ నిలిచాయి. ఈ అవార్డులకు దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పోటీ పడ్డాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు.

ఐసీజేఎస్ అంటే..
క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లోని అన్ని విభాగాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, సమాచార మార్పిడి, విశ్లేషణలతో ఆన్‌లైన్ ద్వారా సమన్వయ పరిచే విధానమే ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్). బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్)అమల్లో అగ్రస్థానం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : మహారాష్ట్ర పోలీసు శాఖ
ఎక్కడ : దేశంలో
Published date : 16 Dec 2020 05:56PM

Photo Stories