Skip to main content

ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా తిరుమూర్తి

ఐక్యరాజ్యస‌మితి (ఐరాస)లో భారత శాశ్వత ప్రతినిధిగా టీఎస్‌ తిరుమూర్తిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 29న ఉత్తర్వులు జారీ చేసింది.
Current Affairs

1985 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన తిరుమూర్తి ప్రస్తుతం విదేశీ మంత్రిత్వశాఖలో కార్యదర్శి హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా ఇప్పటివరకు సేవలందిస్తున్న సయ్యద్‌ అక్బరుద్దీన్‌ స్థానంలో ఆయ‌న బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే ఆస్ర్టేలియాలో భారత రాయబారిగా జైదీప్‌ మజుందార్‌ను, జాయింట్‌ సెక్రటరీ దీపక్‌ మిట్టల్‌ను ఖతార్‌లో భారత రాయబారిగా నియమించారు.


క్షేత్రస్థాయి స్థితిని బట్టి పార్లమెంట్‌

తదుపరి పార్లమెంట్‌ సమావేశాలు ఎప్పటినుంచి నిర్వహించాలన్న దానిపై క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ‘మిషన్‌ కనెక్టు’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఏప్రిల్ 29న పలువురు రాజ్యసభ సభ్యులతో భేటీ అయ్యారు. కరోనా నియంత్రణ కోసం అమలు చేస్తున్న చర్యలతో సత్ఫలితాలు వస్తే షెడ్యూల్‌ ప్రకారమే పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు 2020 ఏడాది ఏప్రిల్‌ 3 వరకు జరగాల్సి ఉండగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23న ముగించిన సంగతి తెలిసిందే.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా నియామ‌కం
ఎప్పుడు : ఏప్రిల్ 29
ఎవరు : టీఎస్‌ తిరుమూర్తి
Published date : 30 Apr 2020 07:26PM

Photo Stories