ఐపీఎల్‌లో అవినీతి నిర్మూలనకు బీసీసీఐ ఏ కంపెనీతో ఒప్పందం చేసుకుంది?
Sakshi Education
ఐపీఎల్-2020లో ఫిక్సింగ్ తదితర అవినీతి కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక ఏర్పాట్లతో సన్నద్ధమైంది.
ఇందు కోసం యునెటైడ్ కింగ్‌డమ్‌కు చెందిన ‘స్పోర్ట్ రాడార్’ అనే కంపెనీతో బోర్డు ప్రత్యేక ఒప్పందం చేసుకుంది. అజిత్ సింగ్ నేతృత్వంలోని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగంతో కలిసి ఈ సంస్థ ఐపీఎల్‌లో పని చేస్తుంది. ఐపీఎల్-2020 సీజన్ సెప్టెంబర్ 19న యూఏఈలో మొదలవుతుంది.
పీటీవీ స్పోర్ట్స్ కు పీసీబీ ప్రసారహక్కులు
సొంతగడ్డపై జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రసార హక్కుల్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా స్థానిక మీడియా సంస్థకు కట్టబెట్టింది. ఈ మేరకు మూడేళ్లకుగానూ పీసీబీ సెప్టెంబర్ 16న ‘పీటీవీ సోర్‌ట్స’తో పాటు ‘ఐ-మీడియా కమ్యూనికేషన్ సర్వీసెస్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం 20 కోట్ల అమెరికా డాలర్లకు (పాకిస్తాన్ కరెన్సీలో రూ. 3,327 కోట్లు) పీటీవీ సంస్థకు శాటిలైట్ ప్రసార హక్కులు...ఐ-మీడియా కమ్యూనికేషన్స్కు కేబుల్ పంపిణీ హక్కుల్ని కట్టబెట్టినట్లు పీసీబీ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యునెటైడ్ కింగ్‌డమ్‌కు చెందిన ‘స్పోర్ట్ రాడార్’ అనే కంపెనీతో ఒప్పదం
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)
ఎందుకు : ఐపీఎల్-2020లో ఫిక్సింగ్ తదితర అవినీతి కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు

Published date : 17 Sep 2020 06:01PM