Skip to main content

ఐపీఎల్ పద్నాలుగో సీజన్ ఏ నగరంలో ప్రారంభమైంది?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) çపద్నాలుగో సీజన్‌ 2021, ఏప్రిల్‌ 9న చెన్నై చిదంబరం స్టేడియంలో ప్రారంభమైంది. ముంబై ఇండియన్స్‌(ఎమ్‌ఐ), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించింది.
Current Affairs
ఎప్పటిలాగే ఈసారి కూడా ఎనిమిది జట్లు బరిలోకి దిగనుండగా, లీగ్‌ దశలో 56 మ్యాచ్‌లు... అనంతరం మూడు ప్లే ఆఫ్‌లు, ఫైనల్‌ కలిపి మొత్తం 60 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మే 30న అహ్మదాబాద్‌లో తుది పోరు జరుగనుంది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌): ఇది ట్వంటీ20 క్రికెట్‌ చాంపియన్‌షిప్‌. భారతదేశంలో ప్రతి ఏటా ఐపీఎల్‌ను నిర్వహిస్తారు. బీసీసీఐ నిర్వహిస్తోన్న ఐపీఎల్‌ 2008 ఏడాదిలో ప్రారంభమైంది. ఐపీఎల్‌–2021 సీజన్‌కు టైటిల్‌ స్పాన్సర్‌గా వివో సంస్థ వ్యవహరిస్తోంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) çపద్నాలుగో సీజన్‌ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్‌ 9
ఎవరు : బీసీసీఐ
ఎక్కడ : చిదంబరం స్టేడియం, చెన్నై
Published date : 10 Apr 2021 06:32PM

Photo Stories