ఐఓసీ బాక్సింగ్ ర్యాంకింగ్స్ లో అమిత్‌కు అగ్రస్థానం
Sakshi Education
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) బాక్సింగ్ టాస్క్ ఫోర్స్ తాజాగా ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్ లో భారత బాక్సర్, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ రజత పతక విజేత అమిత్ పంఘాల్ అగ్రస్థానంలో నిలిచాడు.
52 కేజీల విభాగంలో 420 పాయింట్లతో అమిత్ అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో 2009 అనంతరం బాక్సింగ్‌లో నంబర్‌వన్ ర్యాంకును దక్కించుకున్న తొలి భారత బాక్సర్‌గా అమిత్ నిలిచాడు. గతంలో విజేందర్ సింగ్ (75 కేజీలు) వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు.
మరోవైపు మహిళల విభాగంలో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీ కోమ్ 51 కేజీల విభాగంలో ఐదో స్థానంలో నిలవగా... తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 22వ ర్యాంకును సాధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఓసీ బాక్సింగ్ టాస్క్ ఫోర్స్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : అమిత్ పంఘాల్

Published date : 14 Feb 2020 05:46PM