ఐఎస్‌ఎస్‌కి కరోనా సోకదు: నాసా
అంతరిక్షంలోకి పంపడానికి కొద్దిరోజుల ముందు వ్యోమగాములను క్వారంటైన్‌లో ఉంచుతామని వెల్లడించింది. క్కడికి పంపే వస్తువులనూ క్రిమిరహితం చేస్తామని పేర్కొంది.
ప్రయోగాత్మక టీకా అభివృద్ధి
కరోనా వైరస్‌కు ప్రయోగాత్మకంగా ఒక టీకాను అభివృద్ధి చేసినట్లు ఔషధ తయారీ సంస్థ ‘జాన్సన్ అండ్ జాన్సన్’ ప్రకటించింది. ‘ఏడీ26 సార్స్-కోవ్-2’ అని పేరు పెట్టిన ఈ టీకాను సెప్టెంబర్ నాటికి మానవులపై ప్రయోగించనున్నట్లు తెలిపింది. 2021 ఏడాది ప్రారంభానికల్లా దీన్ని అత్యవసర వినియోగం కోసం సిద్ధం చేస్తామని పేర్కొంది.
ఎంఐటీ కొత్త ఔషధం అభివృద్ధి
మానవ కణాల్లోకి కరోనా వైరస్ ప్రవేశించకుండా అడ్డుకునే ఒక కొత్త ఔషధాన్ని అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టీకా ద్వారా కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా నయం చేయవచ్చని ఎంఐటీ తెలిపింది.