ఐఎస్‌ఎల్ చాంపియన్‌గా బెంగళూరు ఎఫ్‌సీ
Sakshi Education
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో బెంగళూరు ఎఫ్‌సీ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది.
ముంబైలో మార్చి 17న జరిగిన ఫైనల్లో బెంగళూరు 1-0తో గోవా ఎఫ్‌సీ జట్టును ఓడించింది. నిర్ణీత 90 నిమిషాలు ముగిసే సమయానికి రెండు జట్లు 0-0తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోని తొలి భాగంలోనూ గోల్ నమోదు కాలేదు. మరో నాలుగు నిమిషాల్లో అదనపు సమయం కూడా ముగుస్తుందనగా రాహుల్ భాకే గోల్ చేసి బెంగళూరుకు టైటిల్‌ను ఖాయం చేశాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ చాంపియన్
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : బెంగళూరు ఎఫ్‌సీ జట్టు
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ చాంపియన్
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : బెంగళూరు ఎఫ్‌సీ జట్టు
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
Published date : 18 Mar 2019 05:56PM