Skip to main content

ఐఎస్‌ఏ సమావేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) ఆధ్వర్యంలో ఐ సన్‌క్యాప్ 24వ సమావేశం(24th SUN Meet - i-SUN CaP (International capacity Augmentation Programmes for the “Sunshine Countries of ISA” ) జరిగింది.
న్యూఢిల్లీలో అక్టోబర్ 21న జరిగిన ఈ సమావేశంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు పాల్గొన్నారు. పర్యావరణహితమైన సౌర విద్యుత్తును ఉత్పత్తిచేసి సరఫరా చేయాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని ఈ సందర్భంగా వెంకయ్య అన్నారు. 2030 నాటికి సౌర విద్యుదుత్పత్తి రంగంలో రూ.70 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఐ సన్‌క్యాప్ 24వ సమావేశం సందర్భంగా కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్.కె.సింగ్ సమక్షంలో రిపబ్లిక్ ఆఫ్ బోట్స్వానా ప్రతినిధులు అంతర్జాతీయ సౌరకూటమి (ఐఎస్‌ఏ)లో చేరేందుకు సంతకాలు చేశారు.
Published date : 22 Oct 2019 05:33PM

Photo Stories