Skip to main content

ఐఎంఎఫ్ బృందంలో రఘురామ్ రాజన్‌కు చోటు

ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్ కీలక గౌరవాన్ని దక్కించుకున్నారు.
Current Affairs
కోవిడ్-19 సంక్షోభ సమయంలో భారత దేశంలో అనుసరించాల్సిన ఆర్థికవిధానాలపై పలు కీలక సూచనలు చేసిన ఆయన తాజాగా అంతర్జాతీయ ద్యవ్యనిథి సంస్థ (ఐఎంఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటైన సలహా బృందంలో చోటు దక్కించుకన్నారు. ప్రపంచవ్యాప్తంగా 12మంది ఆర్థిక నిపుణులతో ఏర్పాటైన ఈ కమిటీలో రఘురామ్ రాజన్‌ను కూడా చేరుస్తూ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా ఏప్రిల్ 10న ఒక ప్రకటన జారీ చేశారు. గ్లోబల్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన అసాధారణ సవాళ్లు, పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా దృక్పథాలను అందిస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. సింగపూర్ సీనియర్ మంత్రి ,సింగపూర్ ద్రవ్య అథారిటీ చైర్మన్ షణ్ముగరత్నం, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ క్రిస్టిన్ ఫోర్బ్స్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్, యుఎన్ మాజీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లార్డ్ మార్క్ మల్లోచ్ బ్రౌన్ తదితరులు ఈ కమిటీలో వున్నారు. 2016 సెప్టెంబర్ వరకు మూడేళ్లపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా పనిచేసిన రాజన్ ప్రస్తుతం అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఐఎంఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సలహా బృందంలో చోటు
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్
ఎందుకు : గ్లోబల్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన అసాధారణ సవాళ్లు, పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా దృక్పథాలను అందించేందుకు
Published date : 13 Apr 2020 06:01PM

Photo Stories