Skip to main content

ఐఏఎఫ్ ఏఎన్32 విమానం గల్లంతు

భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్32 రకం విమానం గాలిలోకి ఎగిరిన 33 నిమిషాల అనంతరం గల్లంతైంది.
అస్సాం లోని జొర్హాత్ నుంచిజూన్ 3న 13 మందితో బయలుదేరిన ఈ విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది. విమానంలో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు కలిపి మొత్తం 13 మంది ఉన్నారు. విమానం గల్లంతైన ఘటనకు సంబంధించి ఐఏఎఫ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ రాకేశ్ సింగ్ బహదూరియాతో తాను మాట్లాడినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు.

2009 జూన్ నెలలో కూడా ఇటువంటి ఘటనే అరుణాచల్‌లో జరిగింది. ఏఎన్-32 రకం విమానం 13 మందిని ఎక్కించుకుని వెళ్తుండగా అరుణాచల్ ప్రదేశ్‌లోనే కూలిపోయింది. అందులోని మొత్తం 13 మంది మరణించారు. పశ్చిమ సియాంగ్ జిల్లాలోని రించీ హిల్‌పైన ఆ విమానం కూలిపోయింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐఏఎఫ్ ఏఎన్32 విమానం గల్లంతు
ఎప్పుడు : జూన్ 3
ఎక్కడ : అస్సాంలోని జొర్హాత్- అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకా మధ్యలో
Published date : 04 Jun 2019 05:39PM

Photo Stories