Skip to main content

ఐదు బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ శాసనసభ మార్చి 15న నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది.
Current Affairs ఈ ఐదు బిల్లులలో తెలంగాణ లోకాయుక్త-2020 సవరణ బిల్లు, లాభదాయక పదవుల జాబితా నుంచి 29 చైర్మన్ పదవులను మినహాయించే సవరణ బిల్లు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పొడిగింపు బిల్లు ఉన్నాయి. అలాగే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణ బిల్లు, అభయహస్తం పథకం-మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) కో కాంట్రిబ్యూటరీ పింఛను చట్టం రద్దు బిల్లులు కూడా ఉన్నాయి.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పొడిగింపు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగిస్తూ పార్లమెంట్ ఆమోదించిన 2019 రాజ్యాంగ (126 సవరణ) బిల్లును తెలంగాణలో అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ర్యాటిఫై (క్రమబద్ధీకరిస్తూ) చేస్తూ రాష్ట్ర శాసనసభ మార్చి 15న తీర్మానించింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు (2030, అక్టోబర్ 25 వరకు )పొడిగిస్తూ 2019, డిసెంబర్‌లో పార్లమెంట్ చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి : లోకాయుక్త-2020 సవరణ బిల్లుతో పాటు మరో ఐదు బిల్లులకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : తెలంగాణ శాసనసభ
Published date : 17 Mar 2020 08:52PM

Photo Stories