ఐబీసీ చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం
Sakshi Education
దివాలా పరిష్కార ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ)లో సవరణలను తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 24న ఆమోదం తెలిపింది.
తాజా సవరణలతో దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభానికి ముందుగా కార్పొరేట్ రుణగ్రస్తులు ఏవైనా నేరాలకు పాల్పడి ఉంటే.. ఆయా కంపెనీలను కొనుగోలు చేసే నూతన ప్రమోటర్లపై అందుకు సంబంధించి ఎటువంటి బాధ్యత ఉండదు. అలాగే కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు అడ్జుడికేటింగ్ అథారిటీ ఆమోదం తెలిపిన తేదీ తర్వాత కార్పొరేట్ రుణగ్రస్తులను విచారించడానికి లేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ)లో సవరణలకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : దివాలా పరిష్కార ప్రక్రియ సాఫీగా సాగేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ)లో సవరణలకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : దివాలా పరిష్కార ప్రక్రియ సాఫీగా సాగేందుకు
Published date : 25 Dec 2019 05:34PM