Skip to main content

ఐఐఐటీ చట్టం సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మరో ఐదు ఐఐఐటీలను పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్) చట్టం-2017 కిందకు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) చట్టం (సవరణ) బిల్లు-2020’కు మార్చి 20న లోక్‌సభ ఆమోదం తెలిపింది.
Current Affairsసూరత్, భోపాల్, భాగల్‌పూర్, అగర్తలా, రాయ్‌చూర్‌లతో ఉన్న ఐఐఐటీలకు జాతీయ ప్రాధాన్య సంస్థ (ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్) హోదాను కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఐఐఐటీ చట్టం జాబితాలో ఇప్పటికే 15 ఐఐఐటీలు ఉన్నాయి.

ప్రాధాన్య హోదా...
జాతీయ ప్రాధాన్య హోదా పొందిన ఐఐఐటీల్లో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ డిగ్రీలను అందించే వెసులుబాటు కలుగుతుంది. ఐటీ రంగంలో నూతన పరిశోధనలు చేసేందుకు అవసరమైన విద్యార్థులు చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి విద్యాసంస్థల్లో 100 శాతం ప్లేస్‌మెంట్లు కల్పించిన రికార్డు ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోక్రియాల్ లోక్‌సభలో పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐఐఐటీ చట్టం (సవరణ) బిల్లు-2020కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : సూరత్, భోపాల్, భాగల్‌పూర్, అగర్తలా, రాయ్‌చూర్‌లతో ఉన్న ఐఐఐటీలకు జాతీయ హోదా కల్పించేందుకు
Published date : 21 Mar 2020 06:03PM

Photo Stories