అధునాతన సాంకేతికతతో నిర్మించిన కేబుల్ వంతెనను ఏ నగరంలో ప్రారంభించారు?
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కె.తారకరామారావు సెప్టెంబర్ 25న వీటిని ప్రారంభించారు. ఇందులో దుర్గం చెరువు కేబుల్ వంతెనకు రూ. 184 కోట్లు ఖర్చుకాగా, ఎలివేటెడ్ కారిడార్‌కు రూ.150 కోట్లు వ్యయమైంది. ఇంజనీరింగ్ చాలెంజ్‌గా చేపట్టిన ఈ ఐకానిక్ బ్రిడ్జి హైదరాబాద్ హ్యాంగింగ్ బ్రిడ్జిగా, టూరిస్ట్ స్పాట్‌గానూ మారింది.
కేబుల్ బ్రిడ్జి వివరాలు..
కేబుల్ బ్రిడ్జి మొత్తం పొడవు (అప్రోచెస్ సహా) :735.639 మీటర్లు
ఎక్స్‌ట్రా డోస్డ్ కేబుల్ స్టే బ్రిడ్జి పొడవు: 425.85 మీటర్లు (96+233.85+96)
అప్రోచ్ వయాడక్ట్+సాలిడ్ ర్యాంప్: 309.789 మీటర్లు
క్యారేజ్ వే వెడల్పు: 2x9 మీటర్లు (2x3లేన్లు)
ఫుట్‌పాత్ : 2x1.8 మీటర్లు
స్టే కేబుల్స్ 56 (26x2)
ప్రాజెక్ట్ వ్యయం: రూ.184 కోట్లు
నిర్మాణ సంస్థ: ఎల్ అండ్ టీ కన్‌స్ట్రక్షన్
దేశంలో పెద్దది..
- ఎక్స్‌ట్రా డోస్డ్ కేబుల్ స్టే బ్రిడ్జిల్లో అత్యంత పొడవైన మెయిన్ స్పాన్ (233.85 మీటర్లు) దేశంలో ఇదే ప్రథమం. గుజరాత్‌లోని భరూచ్‌లో నర్మద నదిపై 144 మీటర్ల పొడవుతో ఉన్నదే ఇప్పటి వరకు పెద్దది. ప్రపంచవ్యాప్తంగా పరిగణనలోకి తీసుకుంటే ఇది మూడోది.
- జపాన్‌లో ఇంతకంటే పెద్దవి ఉన్నప్పటికీ వాటిల్లో స్టీల్‌ను వినియోగించారు.
- ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్రిడ్జిలో మాత్రం ఇంత పెద్దది ఇంకెక్కడా లేదని ప్రపంచంలోనే ఇది ‘లాంగెస్ట్ స్పాన్ కాంక్రీట్ డెక్ ఎక్స్‌ట్రా డోస్డ్ కేబుల్ స్టేయ్డ్ బ్రిడ్జి’ అని జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ తెలిపారు.
- ‘మేకిన్ ఇండియా’లో భాగంగా అమెరికా, యూరప్, రష్యా, హాంకాంగ్‌లకు చెందిన పేరెన్నికగన్న పలు అంతర్జాతీయ ఇంజనీరింగ్ సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు.
- ఎస్సార్‌డీపీ పనుల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ దీన్ని నిర్మించింది.
ఎలివేటెడ్ కారిడార్
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జిని చేరుకునేందుకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కూడా పూర్తయింది.ఈ ఫ్లైఓవర్ వివరాలు..
పొడవు: 1.74 కి.మీ.
వెడల్పు: 16.60 మీటర్లు(నాలుగులేన్లు)
వ్యయం: రూ.150 కోట్లు
క్విక్ రివ్యూ :
ఏమిటి : అధునాతన సాంకేతికతతో నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ వంతెన ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కె.తారకరామారావు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్‌కు సులభంగా రాకపోకలు సాగించేందుకు