ఆదాయ పన్ను ఈ-కాలిక్యులేటర్ ఆవిష్కరణ
Sakshi Education
కొత్త, పాత విధానాల్లో ఎంత మేర ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోవడానికి వీలు కల్పిస్తూ ఆదాయ పన్ను శాఖ ఫిబ్రవరి 6న ప్రత్యేకంగా ఈ-కాలిక్యులేటర్‌ను ఆవిష్కరించింది.
ఇందులో పాత, కొత్త విధానాలను పోల్చి చూసుకుని, ఏది ప్రయోజనకరంగా ఉంటుందో ఒక అంచనాకు రావచ్చు. తమ ఆదాయాలు, మినహాయింపులు, డిడక్షన్స్ మొదలైన వివరాలన్నీ ఇందులో పొందుపరిస్తే.. పాత, కొత్త విధానాల్లో పన్ను భారాలను తెలుసుకోవచ్చు.
బడ్జెట్‌లో..
కొన్ని మినహాయింపులను వదులుకున్న పక్షంలో తక్కువ పన్ను భారం వర్తించేలా 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేంద్రం కొత్త శ్లాబులు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత విధానంలో ఆదాయాన్ని బట్టి 5, 10, 30 శాతాల్లో పన్నులు ఉంటున్నాయి. ఐటీ రిటర్నులను దాఖలు చేసేందుకు ఉద్దేశించిన www.incometaxindiaefiling.gov.in లో ఈ కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆదాయ పన్ను ఈ-కాలిక్యులేటర్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : ఆదాయ పన్ను శాఖ
ఎందుకు : ఎంత మేర ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోవడానికి వీలుగా

Published date : 07 Feb 2020 05:45PM