Skip to main content

అబుదాబిలో తొలి హిందూ ఆలయం

యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుదాబిలో నిర్మించనున్న తొలి హిందూ దేవాలయానికి శంకుస్థాపన జరిగింది.
ఆలయాన్ని నిర్మిస్తున్న బోచసన్‌వాసి శ్రీ అక్షర్-పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) అధిపతి మహాంత్ స్వామి మహారాజ్ గర్భగుడి నిర్మాణం కోసం పునాదిరాయి వేశారు. అబుదాబి-దుబాయ్ హైవేకు సమీపంలో 14 ఎకరాల్లో ఏడు అంతస్తులుగా ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఆర్ట్ గ్యాలరీ, గ్రంథాలయం, వ్యాయామశాల ఏర్పాటు చేయనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అబుదాబిలో తొలి హిందూ ఆలయం
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : బీఏపీఎస్ అధిపతి మహాంత్ స్వామి మహారాజ్
ఎక్కడ : అబుదాబి, యూఏఈ
Published date : 22 Apr 2019 05:55PM

Photo Stories