Skip to main content

అబుదాబి గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్

ఫార్ములావన్ సీజన్‌లో చివరిదైన 21వ రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు.
Current Affairsడిసెంబర్ 1న జరిగిన ఈ రేసులో 34 ఏళ్ల హామిల్టన్ 55 ల్యాప్‌లను గంటా 34 నిమిషాల 05.715 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో హామిల్టన్ ఈ సీజన్‌లో 11వ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లయింది. సీజన్‌లో రెండు రేసులు మిగిలి ఉండగానే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఖాయం చేసుకున్న హామిల్టన్ మొత్తం 413 పాయింట్లు సాధించాడు. బొటాస్ (మెర్సిడెస్-326 పాయింట్లు) రెండో స్థానంలో ... వెర్‌స్టాపెన్ (278 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు.
  • 2019 ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో మొత్తం 21 రేసులు జరిగాయి. అయితే ఐదుగురు డ్రైవర్లు మాత్రమే కనీసం ఒక్కో టైటిల్ సాధించగలిగారు. హామిల్టన్ 11 టైటిల్స్ నెగ్గాడు. బొటాస్ 4 టైటిల్స్, వెర్‌స్టాపెన్ 3 టైటిల్స్, లెక్‌లెర్క్ 2 టైటిల్స్, వెటెల్ ఒక టైటిల్ గెలిచారు.
  • ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో పాల్గొన్న 10 జట్లలో మూడు జట్లు మాత్రమే టైటిల్స్ సాధించాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అబుదాబి గ్రాండ్‌ప్రి విజేత
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్
Published date : 02 Dec 2019 05:50PM

Photo Stories