Skip to main content

అబార్షన్ పరిమితి 24 వారాలకు పెంపు

ప్రత్యేక కేటగిరీల మహిళలకు గర్భ విచ్ఛిత్తి(అబార్షన్) గరిష్ట పరిమితిని 20 వారాల నుంచి 24 వారాలకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించింది.
Current Affairs

లైంగిక దాడి బాధితులు, మైనర్లు, దివ్యాంగులు, వావివరుస తప్పిన ఫలితంగా గర్భం ధరించిన వారికి ఈ పరిమితి వర్తించనుంది. లోక్‌సభ ఏడాది క్రితమే ఆమోదించిన మెడికల్‌ ట‌ర్మీనేష‌న్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ సవరణ బిల్లు–2020కు మార్చి 16వ తేదీన రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. 20 వారాలకు పైబడిన 24 వారాలకు మించని గర్భాలకు ప్రత్యేక కేటగిరీలోకి వస్తుంది. గర్భం కారణంగా ఆ మహిళ ప్రాణానికి హాని కలుగుతుందని లేదా ఆమె శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని లేదా జన్మించే శిశువుకు తీవ్ర శారీరక, మానసిక అవకరాలు కలుగుతాయని వైద్యులు సిఫారసు చేసిన సందర్భాల్లో ఈ చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయి. ఇలాంటి ప్రత్యేక కేటగిరీ కేసులను పరిశీలించేందుకు రాష్ట్రాలు గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్, పీడియాట్రీషియ‌న్‌, మరొకరితో ప్రత్యేక మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గర్భస్రావం చేసిన వైద్యుడు ఆ మహిళ పేరు, ఇతర వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగపర్చరాదు.


క్విక్‌ రివ్యూ:
ఏమిటి :
అబార్షన్‌ గరిష్ట పరిమితిని 20 వారాల నుంచి 24 వారాలకు పెంపు
ఎప్పుడు : మార్చి 16న
Published date : 17 Mar 2021 05:06PM

Photo Stories