Skip to main content

59 శాతం రైతులకు రుణాలు అందడం లేదు

దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 59 శాతం రైతులకు రుణ పథకాలు అందడం లేదని గావ్ కనెక్షన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలే వెల్లడైంది.
రుణ పథకాల సమాచారం వారికి అందనందునే ఇలా జరుగుతోందని తేలింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్ సహా 19 రాష్ట్రాల్లోని 18 వేల మంది రైతులను సర్వే చేసి గావ్ కనెక్షన్ ఈ విషయాలను గుర్తించింది.

గావ్ కనెక్షన్ సర్వేలోని అంశాలు
  • పతి ఐదుగురు రైతుల్లో ఒకరు వాతావరణ మార్పుల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.
  • ఉత్పత్తులకు సరైన ధర రావడం లేదని 43.6 శాతం మంది, పంట ధరలను నిర్ణయించే వెసులుబాటు తమకే ఉండాలని 62 శాతం మంది రైతులు అభిప్రాయపడ్డారు.
  • సాగు సమాచారం కోసం ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి వాటిని ఉపయోగిస్తామని 38 శాతం మంది రైతులు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
59 శాతం గ్రామీణ రైతులకు రుణాలు అందడం లేదు
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : గావ్ కనెక్షన్
ఎక్కడ : దేశ వ్యాప్తంగా
ఎందుకు : రుణ పథకాల సమాచారం వారికి అందనందునే
Published date : 28 Jun 2019 06:15PM

Photo Stories