Skip to main content

50 వేల కోట్ల యూరోలతో ప్రత్యేక ప్యాకేజీ

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కరాళ నృత్యం చేస్తోంది. కోవిడ్‌ బారిన పడి ప్రజ‌లు విలవిలలాడుతున్నారు.
Current Affairs

ఈ నేప‌థ్యంలో తమ సభ్యదేశాల్లో సహాయ కార్యక్రమాల కోసం 50 వేల కోట్ల యూరోలతో ప్రత్యేక ప్యాకేజీని అందించడానికి ఈయూ ఆర్థిక మంత్రులు అంగీకరించారు. మ‌రోవైపు క‌రోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య ఏప్రిల్ 10 నాటికి 1,01,485కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 16లక్షల 75వేల మందికిపైగా కరోనా వైరస్‌ బారినపడ్డారు.


అమెరికా–
చైనా మధ్య మళ్లీ చిచ్చు
కరోనా వైరస్‌ అమెరికాను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్న సమయంలో చైనాపై అగ్రరాజ్యం మరోసారి కన్నెర్ర చేసింది. అమెరికా మార్కెట్లో మొబైల్‌ సేవలు అందిస్తున్న ‘చైనా టెలికం (అమెరికా)’ను నిషేధిస్తామంటూ హెచ్చరించింది. భద్రత, న్యాయపరమైన ముప్పు ఉందంటూ అమెరికా న్యాయ శాఖ పేర్కొంది. చైనాలో రెండో అతిపెద్ద టెలికం కంపెనీ అయిన ‘చైనా టెలికం’ సబ్సిడరీయే చైనా టెలికం (అమెరికా). అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి అమెరికాకు టెలికమ్యూనికేషన్‌ సర్వీసులకు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేయాలంటూ అమెరికా న్యాయ, రక్షణ, అంతర్గత భద్రత (హోం), వాణిజ్య శాఖలు ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (ఎఫ్‌సీసీ)ను కోరాయి. కీలక శాఖల డిమాండ్‌ను ఎఫ్‌సీసీ ఆమోదిస్తే కోట్లాది అమెరికన్ల ఫోన్‌ సేవలకు విఘాతం ఏర్పడనుందన్నది విశ్లేషకుల అంచనా. అమెరికా తాజా చ‌ర్యల‌ను చైనా వ్యతిరేకించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 50 వేల కోట్ల యూరోలతో ప్రత్యేక ప్యాకేజీ
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : ఈయూ ఆర్థిక మంత్రులు
ఎక్కడ : యూరోపియ‌న్ యూనియ‌న్‌
ఎందుకు : కోవిడ్‌-19 కార‌ణంగా
Published date : 11 Apr 2020 06:18PM

Photo Stories