Skip to main content

48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన న్యాయమూర్తి?

భారత సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ నియమితులయ్యారు.
Current Affairsఈ మేరకు ఆయన నియామకాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించడంతో కేంద్ర న్యాయ శాఖ ఏప్రిల్‌ 6న ఉత్తర్వులు జారీ చేసింది. 2021, ఏప్రిల్‌ 24వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న రమణ... 2022, ఆగస్టు 26 వరకు సీజేఐ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే పదవీ కాలం 2021, ఏప్రిల్‌ 23వ తేదీతో ముగియనుంది.

తెలుగువారిలో రెండో వ్యక్తి...

జస్టిస్‌ రమణ... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టనున్న తెలుగువారిలో రెండో వ్యక్తి. అంతకుముందు రాజమహేంద్రవరానికి చెందిన జస్టిస్‌ కోకా సుబ్బారావు (జూన్‌ 30, 1966– ఏప్రిల్‌ 11, 1967) సుప్రీంకోర్టు తొమ్మిదో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగు వారైన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డిలు న్యాయమూర్తులుగా కొనసాగుతున్న విషయం విదితమే.

జస్టిస్‌ రమణ నేపథ్యం...
  • పుట్టిన తేదీ : 1957, ఆగస్టు 27
  • ఊరు : పొన్నవరం, కృష్ణాజిల్లా
  • న్యాయవాదిగా పేరు నమోదు : 1983, ఫిబ్రవరి 10
  • హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియామకం : 2000, జూన్‌ 27
  • హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు: 2013, మార్చి 10 నుంచి మే 20 వరకు
  • న్యూఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి: 2013, సెప్టెంబరు 2
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి : 2014, ఫిబ్రవరి 17
  • భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేది : 2021 ఏప్రిల్‌ 24న

మరిన్ని వివరాలు...
  • వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ... ఉమ్మడి ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ట్రైబ్యునళ్లు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.
  • సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, ఎన్నికల అంశాల్లో కేసులు వాదించారు.
  • అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార కేసులు, క్రిమినల్‌ కేసుల్లో నిపుణుడిగా పేరు పొందారు. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు.
  • కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్, క్యాట్, హైదరాబాద్‌లో రైల్వే స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా సేవలందించారు.
  • 2019, మార్చి 7 నుంచి నవంబర్‌ 26 వరకు సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.
  • 2019 నవంబర్‌ 27 నుంచి నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన న్యాయమూర్తి?
ఎప్పుడు : ఏప్రిల్‌ 6
ఎవరు : జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ
ఎందుకు : ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే పదవీ కాలం 2021, ఏప్రిల్‌ 23వ తేదీతో ముగియనుండటంతో...
Published date : 07 Apr 2021 06:18PM

Photo Stories