40 కోట్ల యూజర్ల సంఖ్య అధిగమించిన తొలి టెలికం సంస్థ?
Sakshi Education
టెలికం సంస్థ రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య 40 కోట్లు దాటింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 40 కోట్ల యూజర్ల సంఖ్య అధిగమించిన తొలి టెలికం సంస్థ
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : రిలయన్స్ జియో
ఎక్కడ : దేశంలో
దీంతో దేశీయంగా ఈ మార్కును అధిగమించిన తొలి సంస్థగా జియో నిలిచింది. 2020, జూలైలో కొత్తగా మరో 35 లక్షల కనెక్షన్లు జత కావడంతో ఇది సాధ్యపడింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఇది వెల్లడైంది.
ట్రాయ్ లెక్కల ప్రకారం...
ట్రాయ్ లెక్కల ప్రకారం...
- మొత్తం టెలికం యూజర్ల సంఖ్య 2020, జూన్‌లో 116 కోట్లుగా ఉండగా జూలైలో స్వల్పంగా పెరిగి 116.4 కోట్లకు చేరింది.
- మొబైల్ కనెక్షన్లకు సంబంధించి జూలైలో భారతి ఎయిర్‌టెల్ యూజర్ల సంఖ్య 32.6 లక్షలు, బీఎస్‌ఎన్‌ఎల్ సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 3.88 లక్షలు పెరిగింది.
- వొడాఫోన్ ఐడియా 37 లక్షల మంది యూజర్లను, ఎంటీఎన్‌ఎల్ 5,457 మంది యూజర్లను కోల్పోయింది.
- మొబైల్ మార్కెట్‌లో జియో వాటా 35.03 శాతానికి చేరింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 40 కోట్ల యూజర్ల సంఖ్య అధిగమించిన తొలి టెలికం సంస్థ
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : రిలయన్స్ జియో
ఎక్కడ : దేశంలో
Published date : 16 Oct 2020 12:17PM