Skip to main content

370వ అధికరణ రద్దుకు ఆమోదం

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసే తీర్మానాన్ని, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2019ను రాజ్యసభ ఆగస్టు 5న ఆమోదించింది.
370వ అధికరణాన్ని రద్దు చేయడం కోసం రాష్ట్రపతి సంతకంతో నోటిఫికేషన్ విడుదలైన అనంతరం హోం మంత్రి అమిత్ షా ఈ రెండు తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. అలాగే జమ్మూకశ్మీర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల బిల్లును సభ ముందుంచారు. తీర్మానం, రిజర్వేషన్ల బిల్లును మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదించింది. పునర్వ్యవస్థీకరణ బిల్లుపై మాత్రం ఓటింగ్ నిర్వహించగా అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి.

జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2019 ప్రకారం జమ్ముకశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లదాఖ్ ప్రాంతాన్ని అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
370వ అధికరణ రద్దుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : రాజ్యసభ
Published date : 06 Aug 2019 05:25PM

Photo Stories