Skip to main content

25వ ప్రపంచ పర్యావరణ సదస్సు(కాప్-25)

25వ ప్రపంచ పర్యావరణ సదస్సు (కాన్ఫరెన్స్‌ ఆఫ్ పార్టీస్-కాప్ 25)ను స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో నిర్వహిస్తున్నారు.
Current Affairs డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 13 వరకు జరిగే ఈ సదస్సుకు దాదాపు 197 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. గ్లోబల్ వార్మింగ్, విపత్తు ప్రభావాలు, వాతావరణ మార్పుల నుంచి పుడమిని రక్షించడంతోపాటు వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

కాప్ 25 సదస్సులో పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ డిసెంబర్ 11న ప్రత్యేక ప్రసంగం చేశారు. వాతావరణ కాలుష్యంపై పాలకులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని 16 ఏళ్ల గ్రెటా ఆగ్రహం వ్యక్తంచేశారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రణాళికలు మాత్రమే ప్రకటించి వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వాతావరణ కాలుష్యంపై ప్రజలకు సరైన అవగాహన కల్పించడం లేదన్నారు. ప్రస్తుత సదస్సులో అయినా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ప్రకటించి వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం భూ ఉష్ణోగ్రతల్లో 1.5 డిగ్రీల సెల్సియస్ అదనంగా నమోదవుతున్నాయని, దీన్ని తగ్గించకపోతే ప్రపంచానికి ప్రమాదకరమని గ్రెటా హెచ్చరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :25వ ప్రపంచ పర్యావరణ సదస్సు(కాప్ 25)
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎక్కడ : మాడ్రిడ్, స్పెయిన్
ఎందుకు : గ్లోబల్ వార్మింగ్, విపత్తు ప్రభావాలు, వాతావరణ మార్పుల నుంచి పుడమిని రక్షించడంతోపాటు వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు
Published date : 12 Dec 2019 06:28PM

Photo Stories