Skip to main content

2022 నాటికి ప్లాస్టిక్ వ్యర్థ రహితంగా ఏపీ

ఆంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి ప్లాస్టిక్ వ్యర్థ రహితంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతోఅజిత్ సింగ్ నగర్‌లోని ఎక్సెల్‌ప్లాంట్ చెత్త డంపింగ్ యార్డ్‌లో తలపెట్టిన ప్లాస్టిక్ వ్యర్థాల యాజమాన్య కార్యక్రమాన్ని నవంబర్ 19న మంత్రి ప్రారంభించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను అల్ట్రాటెక్ సిమెంట్స్ పరిశ్రమకు పంపే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 110 పురపాలక సంఘాలలో 44 చోట్ల వ్యర్థాల సేకరణ సదుపాయాలున్నాయని, మిగిలిన 66 పురపాలక సంఘాల్లో ఏర్పాటు చేసి 2022 నాటికల్లా ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా అరికట్టేలా చర్యలు చేపట్టామన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2022 నాటికి ప్లాస్టిక్ వ్యర్థ రహితంగా ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
Published date : 20 Nov 2019 04:35PM

Photo Stories