2022 నాటికి భారత్‌లో హై-స్పీడ్ ఇంటర్నెట్: వన్‌వెబ్
Sakshi Education
భారత్‌లో 2022 మధ్య నాటికి అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించగలమని <b>బ్రాడ్‌బ్యాండ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ వన్‌వెబ్</b> వెల్లడించింది.
ఇందుకు తోడ్పడేలా డిసెంబర్ 18న 36 కమ్యూనికేషన్స్ ఉపగ్రహాలను రష్యా నుంచి ప్రయోగించినట్లు వివరించింది. ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి ఇంటర్నెట్ సర్వీసులను అందించేందుకు వన్‌వెబ్ ప్రయోగించిన ఉపగ్రహాలు ఉపయోగపడనున్నాయి.
దివాలా ప్రక్రియను ఎదుర్కొన్న వన్‌వెబ్‌ను దేశీ టెలికం దిగ్గజం భారతి గ్రూప్, బ్రిటన్ ప్రభుత్వం ఇటీవలే వన్‌వెబ్‌ను సంయుక్తంగా కొనుగోలు చేశాయి. ఇది జరిగిన కొన్ని వారాలకే ఈ సంస్థ 36 ఉపగ్రహాలను ప్రయోగించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రష్యా నుంచి 36 కమ్యూనికేషన్స్ ఉపగ్రహాల ప్రయోగం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : బ్రాడ్‌బ్యాండ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ వన్‌వెబ్
ఎందుకు : అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు

Published date : 19 Dec 2020 07:25PM