2021 ఏడాదే ఎల్‌ఐసీ ఐపీవో, లేహ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు
Sakshi Education
2021 ఏడాదిలోనే జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) ఐపీవోను విడుదల చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
మూలధన సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. రూ.5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి అని వివరించారు."రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. కనీస మద్దతు ధర ఎప్పటికప్పుడు పెరుగుతుంది. 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం కేంద్ర పథకాల హేతుబద్ధీకరణ. 2021-22లో బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, ఐడీబీఐల అమ్మకం పూర్తి అవుతుందిష అని మంత్రి నిర్మల వెల్లడించారు.
2021-22 బడ్జెట్‌లోని మరిన్ని అంశాలు
- పీపీపీ పద్ధతి ద్వారా 7 కొత్త ప్రాజెక్ట్‌ల అభివృద్ధికి రూ.2,200 కోట్లు
- ఉజ్వల స్కీమ్ కింద మరో 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు
- జమ్మూకశ్మీర్‌లో గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు
- కొత్తగా మరో 100 జిల్లాల్లో గ్యాస్ పంపిణీని పటిష్టం చేస్తాం
- సొలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రూ.వెయ్యి కోట్లు
- బ్యాంక్ ఖాతాదారులకు ఇన్సూరెన్స్ రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు
- ఇన్వెస్టర్ రక్షణ కోసం కొత్త ఇన్వెస్టర్ ఛార్టర్ ఏర్పాటు
- బీమా రంగంలో ఎఫ్‌డీఐలు 74 శాతానికి పెంపు
- 2023 నాటికి 100 శాతం బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ
- 2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు
- రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు
- 2కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు
- జల జీవన్ మిషన్‌కు రూ.2,87,000 కోట్లు కేటాయింపు
- కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం 35వేల,400 కోట్లు
- మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్ పార్క్
- కొత్తగా బీఎస్‌ఎల్-3 ప్రయోగశాలలు 9 ఏర్పాటు
- ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు.
- లేహ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ, ఆదివాసీ ప్రాంతాల్లో 750 ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు.
- పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కార్యక్రమంలో మార్పులు
- పరిశోధనా, నాణ్యత, మెరుగుదల కోసం జపాన్‌తో ఒప్పందం.
- వ్యవసాయ మౌలిక నిధి ఏర్పాటు. ఈ నిధితో మౌలిక సౌకర్యాల పెంపు.
- ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు విధానం దేశంలో అన్ని ప్రాంతాల్లో అమలు. వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం. కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్ తీసుకోవచ్చు.
Published date : 01 Feb 2021 12:29PM