Skip to main content

2020లో ప్రపంచ వృద్ధి 1 శాతమే: ఈఐయూ

కరోనా వైరస్ మహమ్మారి ప్రతికూల ప్రభావంతో 2020లో ప్రపంచ వృద్ధి 1 శాతానికి పడిపోనున్నట్లు ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) తెలిపింది.
Current Affairsఈ మేరకు మార్చి 18న ఒక నివేదికను విడుదల చేసింది. కోవిడ్-19 వ్యాప్తికి ముందు ప్రపంచ వృద్ధి 2.3 శాతంగా ఉంటుందని అంచనా వేసిన విషయం తెలిసిందే. పెద్ద ఆర్థిక వ్యవస్థలైన జపాన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ పూర్తి ఏడాది మాంద్యంలోకి జారిపోవచ్చని ఈఐయూ పేర్కొంది. ప్రపంచ జనాభాలో 50 శాతం మంది ప్రజలకు వైరస్ సోకవచ్చని.. 20 శాతం కేసులు తీవ్రంగా ఉంటాయని, 1-3 శాతం మరణాలు సంభవించవచ్చని వివరించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2020లో ప్రపంచ వృద్ధి 1 శాతమే
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ)
ఎందుకు : కరోనా వైరస్ ప్రభావంతో
Published date : 19 Mar 2020 05:37PM

Photo Stories