Skip to main content

2020 ఒలింపిక్స్ నిర్వహణపై ఐఓసీ సమావేశం

కొవిడ్-19 విలయతాండవం చేస్తున్నప్పటికీ ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ను నిర్వహించడమే లక్ష్యంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మార్చి 17న టోక్యోలో ప్రత్యేక సమావేశం నిర్వహించింది.
Current Affairs2020 టోక్యో ఒలింపిక్స్‌కు ఈవెంట్‌కు ఇంకా నాలుగు నెలలు సమయం ఉండటంతో ఇప్పటికిప్పుడు ఎలాంటి అనుచిత, అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఐఓసీ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ అభిప్రాయపడింది. అందరి సంరక్షణకే తమ తొలి ప్రాధాన్యమని, ఆరోగ్యకరమైన వాతావరణంలోనే ఆటలు సాగుతాయని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు.2020, జూలై నుంచి ఆగస్టు 29 వరకు 2020 సమ్మర్ ఒలింపిక్స్ జరగనున్నాయి.

అన్ని శిబిరాలు వాయిదా: రిజిజు
భారత్‌లోనూ కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తుండటంతో దేశంలో అన్ని రకాల శిక్షణ శిబిరాలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఒలింపిక్స్ సన్నాహక శిబిరాలు మాత్రమే యథాతథంగా కొనసాగుతాయని ఆయన చెప్పారు.

పాకిస్తాన్ సూపర్ లీగ్ రద్దు
కరోనా వైరస్ కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)ను వాయిదా వేస్తున్నట్లు మార్చి 17న పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబి) ప్రకటించింది. ఇప్పటికే నాకౌట్ దశకు చేరిన ఈ లీగ్‌లో లాహోర్ వేదికగా జరగాల్సిన రెండు సెమీస్ మ్యాచ్‌లతోపాటు ఫైనల్‌నూ వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. తిరిగి ఎప్పుడు నిర్వహించేది మాత్రం వెల్లడించలేదు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2020 ఒలింపిక్స్ నిర్వహణపై సమావేశం
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)
ఎక్కడ : టోక్యో, జపాన్
ఎందుకు : కొవిడ్-19 కారణంగా
Published date : 18 Mar 2020 06:21PM

Photo Stories