Skip to main content

2020 ఏడాదిలో భారత్‌ ఫైనాన్షియల్‌ వెల్త్‌ ఎంత శాతం ఎగసింది?

కరోనా ప్రేరిత సవాళ్లలో చిక్కుకున్నప్పటికీ, 2020 ఏడాదిలో భారత్‌ ఫైనాన్షియల్‌ వెల్త్‌ 11 శాతం ఎగసి 3.4 ట్రిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.250 లక్షల కోట్లు) చేరింది.
Current Affairs జూన్‌15న విడుదలైన గ్లోబల్‌ కన్సల్టెన్సీ సంస్థ– బీసీజీ నివేదిక ఈ విషయాన్ని తెలిపింది.

నివేదికలోని ముఖ్యాంశాలు...
  • మహమ్మారి సవాళ్ల ప్రారంభమైన తొలి నెలల్లో షేర్‌ మార్కెట్‌ భారీగా పడిపోయినప్పటికీ, అనంతరం స్టాక్స్‌లో భారీ ర్యాలీ చోటుచేసుకుంది.
  • మొత్తంగా 2025 నాటికి భారత్‌ ఫైనాన్షియల్‌ వెల్త్‌ 5.5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది.
  • 2025 నాటికి 100 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.733 కోట్లు) సంపదపైబడిన వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. వీరి సంఖ్య వచ్చే ఐదేళ్లలో దాదాపు రెట్టింపై 1,400కు చేరవచ్చు.
  • భారత్‌ అంతర్గతంగా ఎటువంటి సంబంధం లేకుండా అంతర్జాతీయంగా పొందిన భారతీయుల ఫైనాన్షియల్‌ వెల్త్‌ 2020లో 194 బిలియన్‌ డాలర్లు. మొత్తం ఫైనాన్షియల్‌ వెల్త్‌లో ఈ వాటా 5.7 శాతం. 2025లో ఈ రేటు 6.3 శాతంకి ఎగసే అవకాశం ఉంది.
  • ఫైనాన్షియల్‌ వెల్త్‌ విషయంలో కేటాయింపులు చూస్తే, తొలి స్థానంలో కరెన్సీ నిల్వ ఉంది. డిపాజిట్లు తరువాతి స్థానంలో నిలిచాయి. ఈక్విటీలు, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.

ఫైనాన్షియల్‌ వెల్త్‌ అంటే..
దేశంలో వయోజనుల స్థిర ఆస్తులు, అప్పు లు పరిగణనలోకి తీసుకోకుండా లెక్కించే మొ త్తం సంపదనే ‘ఫైనాన్షియల్‌ వెల్త్‌’గా పరిగణిస్తారు. కరెన్సీ, డిపాజిట్లు, ఈక్విటీలు, జీవిత బీమా వంటివి ఈ విభాగం కిందకు వస్తాయి.
Published date : 16 Jun 2021 07:42PM

Photo Stories