2018 జీడీపీ ర్యాంకులు విడుదల
Sakshi Education
ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకుల జాబితాను ఆగస్టు 2న విడుదల చేసింది.
ఈ జాబితా ప్రకారం జీడీపీ పరంగా 20.5 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 2.72 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో భారత్ ఏడో ర్యాంకును పొందింది.
ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకులు
2017లో భారత్ ఫ్రాన్స్ ను అధిగమించి ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన విషయం తెలిసిందే. 2017లో భారత జీడీపీ 2.65 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2024 నాటికి భారత జీడీపీని 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. 2019 ఏడాది వరికి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యాన్ని పెట్టుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2018 జీడీపీ ర్యాంకుల జాబితా విడుదల
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : ప్రపంచ బ్యాంకు
ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకులు
ర్యాంకు | దేశం | జీడీపీ విలువ |
1 | అమెరికా | 20.5 ట్రిలియన్ డాలర్లు |
2 | చైనా | 13.6 ట్రిలియన్ డాలర్లు |
3 | జపాన్ | 4.9 ట్రిలియన్ డాలర్లు |
4 | జర్మనీ | 3.9 ట్రిలియన్ డాలర్లు |
5 | బ్రిటన్ | 2.82 ట్రిలియన్ డాలర్లు |
6 | ఫ్రాన్స్ | 2.77 ట్రిలియన్ డాలర్లు |
7 | భారత్ | 2.72 ట్రిలియన్ డాలర్లు |
8 | ఇటలీ | 2.07 ట్రిలియన్ డాలర్లు |
9 | బ్రెజిల్ | 1.87 ట్రిలియన్ డాలర్లు |
10 | కెనడా | 1.71 ట్రిలియన్ డాలర్లు |
2017లో భారత్ ఫ్రాన్స్ ను అధిగమించి ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన విషయం తెలిసిందే. 2017లో భారత జీడీపీ 2.65 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2024 నాటికి భారత జీడీపీని 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. 2019 ఏడాది వరికి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యాన్ని పెట్టుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2018 జీడీపీ ర్యాంకుల జాబితా విడుదల
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : ప్రపంచ బ్యాంకు
Published date : 03 Aug 2019 05:37PM