1500 మీటర్ల పరుగులో స్వర్ణం నెగ్గిన రెండో అతిపిన్న వయస్కుడు?
Sakshi Education
తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న నార్వే అథ్లెట్ జాకబ్ ఇన్‌జెబ్రిగ్‌స్టెన్ సంచలన ప్రదర్శనతో స్వర్ణాన్ని సాధించాడు.
టోక్యో ఒలింపిక్స్–2020లో భాగంగా ఆగస్టు 7న జరిగిన పురుషుల 1500 మీటర్ల పరుగులో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అతడు 3 నిమిషాల 28.32 సెకన్లలో చేరి ఒలింపిక్ రికార్డుతో విజేతగా నిలిచాడు. తద్వారా 1500 మీటర్ల పరుగులో స్వర్ణం నెగ్గిన రెండో అతిపిన్న వయస్కుడిగా 20 ఏళ్ల జాకబ్ నిలిచాడు.
మారథాన్ విజేత పెరీస్
మహిళల మారథాన్‌లో పెరీస్ జెప్చిర్‌చిర్ (కెన్యా) స్వర్ణంతో మెరిసింది. శనివారం జరిగిన 49.125 కిలోమీటర్ల రేసును ఆమె 2 గంటలా 27 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. కెన్యాకే చెందిన బ్రిగిడ్ కొసెగీ రజతాన్ని సాధించగా... మోలీ సిడెల్ (అమెరికా) కాంస్యాన్ని సొంతం చేసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 1500 మీటర్ల పరుగులో స్వర్ణం నెగ్గిన రెండో అతిపిన్న వయస్కుడు?
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : నార్వే అథ్లెట్ జాకబ్ ఇన్‌జెబ్రిగ్‌స్టెన్
ఎక్కడ : టోక్యో, జపాన్
ఎందుకు : టోక్యో ఒలింపిక్స్–2020 పురుషుల 1500 మీటర్ల పరుగు పోటీల్లో విజేతగా నిలిచినందున...

Published date : 09 Aug 2021 05:58PM