14వ పంచవర్ష ప్రణాళిక విజన్ 2035కి సీపీసీ ఆమోదం
Sakshi Education
చైనాలో అధ్యక్షుడు షి జిన్పింగ్ రూపొందించిన 14వ పంచవర్ష ప్రణాళిక విజన్ 2035కి అధికార కమ్యూనిస్టు పార్టీ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా-సీపీసీ) ఆమోద ముద్ర వేసింది. నాలుగు రోజుల పాటు జరిగిన పార్టీ ప్లీనరీ సదస్సు అక్టోబర్ 29న ముగిసింది.
సీపీసీ సెంట్రల్ కమిటీకి చెందిన 198 మంది సభ్యులు, మరో 166 మంది ప్రత్యామ్నాయ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చివరి రోజు విజన్ 2035కి పార్టీఆమోదించడం ద్వారా మరో 15 ఏళ్ల పాటు జిన్పింగ్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారని సీపీసీ సంకేతాలు పంపినట్టయింది.
ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం...
2021–2035 సంవత్సరాల్లో దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం రూపొందించిన ఈ దీర్ఘకాలిక ప్రణాళిక విజన్ 2035పై విస్తృతంగా చర్చలు జరిపాక దానిని ఆమోదించారు. చైనా పూర్తి స్థాయి స్వయం సమృద్ధిని సాధించడానికి, దిగుమతుల్ని పూర్తిగా నిషేధించి, స్వదేశీ మార్కెట్‌ని ప్రోత్సహించేలా దీనిని రూపొందించారు.
మావో తర్వాత...
కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో తర్వాత 67 ఏళ్ల వయసున్న జిన్పింగ్ పార్టీలో అత్యంత శక్తితమంతమైన నాయకుడిగా ఎదిగారు. దేశాధ్యక్షుడిగా రెండు సార్లు మించి పదవి చేపట్టకూడదన్న నిబంధనల్ని రాజ్యాంగ సవరణ ద్వారా 2018లో సవరించి తానే జీవిత కాలం అధ్యక్షుడిగా కొనసాగుతానని ప్రకటించుకున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా జిన్పింగ్ పదవీ కాలం 2022తో ముగియనుంది. ఇప్పుడిక తాను రూపొందించిన విజన్ 2035కి ఆమోద ముద్ర పడడంతో మరో పదిహేనేళ్ల పాటు ఆయన పదవికి ఢోకా ఉండదు.
క్విక్ రివ్వూ :
ఏమిటి : 14వ పంచవర్ష ప్రణాళిక విజన్ 2035కి ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా-సీపీసీ
ఎందుకు :2021–2035 సంవత్సరాల్లో చైనా ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం

Published date : 31 Oct 2020 05:38PM