Skip to main content

106వ ఇండియన్ సైన్స్‌ కాంగ్రెస్ ప్రారంభం

పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో 106వ ఇండియన్ సైన్స్‌ కాంగ్రెస్ (ఐఎస్‌సీ)ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 3న ప్రారంభించనున్నారు.
‘ఫ్యూచర్ ఇండియా: సైన్స్‌ అండ్ టెక్నాలజీ’ఇతివృత్తంగా ఐదు రోజులపాటు జరిగే ఈ కాంగ్రెస్‌కు దేశ విదేశాలకు చెందిన దాదాపు 30 వేల మంది పాల్గొననున్నారు. వీరిలో నోబెల్ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. దేశ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచే ఉద్దేశంతో ఏటా జనవరిలో సైన్స్‌ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : 106వ ఇండియన్ సైన్స్‌ కాంగ్రెస్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, జలంధర్, పంజాబ్
Published date : 03 Jan 2019 04:59PM

Photo Stories