10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన రాష్ట్రం?
రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమల్లోకి తెస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తాజాగా ఈడబ్ల్యూఎస్ కోటాతో మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి పెరిగాయి.
ఈడబ్ల్యూఎస్‌లకు ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాలు(ఓబీసీలు) మినహా ఆర్థి కంగా వెనుకబడిన వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన రాష్ట్రం?
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : తెలంగాణ
ఎందుకు : ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోసం