జనవరి 2018 ద్వైపాక్షిక సంబంధాలు
Sakshi Education
భారత్ - కంబోడియా మధ్య 4 ఒప్పందాలు
భారత్-కంబోడియాల మధ్య రక్షణ బంధాల బలోపేతానికి కృషి చేయాలని ఇరుదేశాల ప్రధానులు నిర్ణయించారు. ఉగ్రవాద నిర్వీర్యం చేయటంలో అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేయటంపై కలిసి పోరాడాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కంబోడియా ప్రధానమంత్రి హున్‌సేన్‌ల మధ్య జనవరి 27న రక్షణ, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పరస్పరసాయానికి చర్చలు జరిగాయి. అనంతరం వీరిరువురి సమక్షంలో ఇరుదేశాల మధ్య 4 ఒప్పందాలపై ఒప్పందాలు జరిగాయి. నేరస్తుల అప్పగింత, నేర సంబంధిత విచారణకు న్యాయసాయం, కంబోడియాలోని స్వా హబ్ నీటి వనరుల అభివృద్ధి ప్రాజెక్టుకు భారత రుణసాయం (దాదాపు రూ.234 కోట్లు) అంశాలపై ఈ ఒప్పందాలు చేసుకున్నారు.
మోదీకి కానుకగా నీటిశుద్ధి యంత్రం
భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రత్యేకమైన కానుక అందజేశారు. నీటిలోని లవణాలు తొలగించి శుద్ధిచేసే ‘గాల్-మొబైల్ వాటర్ డీసాలినేషన్ అండ్ ప్యూరిఫికేషన్ జీప్’ను కానుకగా ఇచ్చారు. అహ్మదాబాద్ జిల్లా బావ్లా సమీపంలో జనవరి 17న జరిగిన కార్యక్రమంలో ఈ నీటి శుద్ధి యంత్రాన్ని మోదీకి అందజేశారు. ఈ వాహనాన్ని నెతన్యాహు సమక్షంలోనే బసకంఠ జిల్లా సుయిగామ్ (భారత్-పాక్ సరిహద్దుల్లోని గ్రామం) ప్రజలకు మోదీ అంకితం చేశారు. సరిహద్దుల్లోని సుయిగామ్‌లో ఇది ఉంటుందని.. దీనిద్వారా సరిహద్దులోని జవాన్లకు శుద్ధమైన తాగునీరు అందుతుందని మోదీ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మోదీకి కానుకగా నీటిశుద్ధి యంత్రం
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఎందుకు : ఇజ్రాయెల్ ప్రధాని భారత పర్యటనలో భాగంగా
ఆస్ట్రేలియా గ్రూప్‌లో భారత్‌కు చోటు
క్షిపణి సాంకేతికత నియంత్రణ కూటమి (ఎంటీసీఆర్), వాసెనార్ గ్రూప్‌లలో స్థానం దక్కించుకున్న భారత్‌కు జనవరి 19న జీవ, రసాయనిక ఆయుధాల నియంత్రణ సంస్థ అయిన ఆస్ట్రేలియా గ్రూప్‌లోనూ చోటు దక్కింది.
జీవ, రసాయనిక ఆయుధాలను అభివృద్ధి చేసుకోకుండా.. వీటి తయారీకి అవసరమైన పరికరాలు, ముడిపదార్థాలు, సాంకేతిక వ్యాప్తిని వ్యతిరేకించే దేశాలను సమన్వయం చేసే, సామరస్యపూర్వక ఎగుమతుల నియంత్రణను పర్యవేక్షించే స్వచ్ఛంద సంస్థగా ఆస్ట్రేలియా గ్రూప్ (ఏజీ) పనిచేస్తోంది. అణ్వాయుధ నిరాయుధీకరణ లక్ష్యాలను చేరుకోవటం, అంతర్జాతీయ భద్రతలో ఈ సభ్యత్వం పరస్పర ప్రయోజనకారిగా ఉంటుందని భారత విదేశాంగ ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు. ఏజీలో సభ్యత్వం భారత విశ్వసనీయత మరింత పెరిగేందుకు దోహదపడుతుందన్నారు. 2016లో ఎంటీసీఆర్‌లో, గతేడాది వాసెనార్ గ్రూప్‌లో భారత్ సభ్యత్వం పొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్ట్రేలియా గ్రూప్‌లో భారత్‌కు చోటు
ఎప్పుడు : జనవరి 19
ఎందుకు : జీవ, రసాయనిక ఆయుధాల నియంత్రణ సంస్థ
ఆకర్షణీయ నగరాల జాబితాలోకి మరో తొమ్మిది
ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టులో కొత్తగా తొమ్మిది నగరాలు చేరాయి. దీంతో వీటి సంఖ్య 99కి చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, మొరాదాబాద్, సహరన్‌పూర్; తమిళనాడులోని ఈరోడ్; బిహార్‌లోని బిహార్‌షరీఫ్, దాద్రా నగర్ హవేలీలోని సిల్వాసా, లక్షద్వీప్‌లోని కవరత్తి; అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్ తదితర నగరాలు తాజా జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ జనవరి 19న ప్రకటన చేశారు.
ఢిల్లీలో భారత్ - ఆసియాన్ సదస్సు
జనవరి 25, 26న ఢిల్లీలో భారత్-ఆసియాన్ సదస్సు జరగనుంది. సదస్సులో భాగంగా మహాకావ్యం రామాయణంలోని కొన్ని ఘట్టాలను కళాకారులు ప్రదర్శించనున్నారు. ఆసియాన్ దేశాల(ఇండోనేసియా, సింగపూర్, ఫిలిప్పైన్‌స, మలేసియా, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, బ్రూనై, మయన్మార్, లావోస్) అధినేతలు ఈ కార్యక్రమాల్ని తిలకించనున్నారు. భారత్-ఆసియాన్ సంబంధాలకు పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి జరిగే గణతంత్ర వేడుకలకు ఆ దేశాల అధినేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-ఆసియాన్ సదస్సు
ఎప్పుడు : జనవరి 25, 26
ఎక్కడ : ఢిల్లీలో
భారతీయులను వెనక్కి పంపే ఒప్పందాలపై భారత్-బ్రిటన్ సంతకాలు
చట్ట విరుద్ధంగా బ్రిటన్‌లో నివశిస్తున్న భారతీయులను వెనక్కి తిప్పి పంపేయడానికి సంబంధించిన రెండు ఒప్పందాలపై భారత్-బ్రిటన్‌లు లండన్‌లో 2018, జనవరి 13న సంతకాలు చేశాయి. ఉభయ దేశాల మధ్య కుదిరిన రెండు అవగాహన ఒప్పందాలపై భారత హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, బ్రిటన్ ఇమిగ్రేషన్ వ్యవహారాల మంత్రి కెరోలిన్‌నోక్స్ సంతకాలు చేశారు.
భారత్‌లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పర్యటన
ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జనవరి 14న భారత్ చేరుకున్నారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి.. ఢిల్లీ విమానాశ్రయంలో నెతన్యాహుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై భారత్, ఇజ్రాయెల్‌లు సంతకాలు చేయనున్నాయి.
తీన్ మూర్తి-హైఫా చౌక్‌గా పేరు మార్పు
అంతకుముందు సెంట్రల్ ఢిల్లీలోని తీన్ మూర్తి చౌక్ మెమోరియల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీ, నెతన్యాహు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ చౌక్ పేరును అధికారికంగా తీన్ మూర్తి- హైఫా చౌక్‌గా మార్చారు. ఇజ్రాయెల్ నగరం హైఫా విముక్తి కోసం మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమరులైన భారతీయ సైనికులకు ఇరువురు నేతలు నివాళులర్పించారు. తీన్ మూర్తి మెమోరియల్‌లోని సందర్శకుల పుస్తకంలో సంతకాలు చేశారు.
తీన్‌మూర్తి చౌక్‌లోని మూడు కాంస్య విగ్రహాలు.. ‘15వ ఇంపీరియల్ సర్వీస్ బ్రిగేడ్’కు చెందిన హైదరాబాద్, జోధ్‌ఫూర్, మైసూర్ సైనికులకు ప్రతీక. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సెప్టెంబర్ 23, 1918న హైఫాకు ఒట్టొమాన్, జర్మనీ బలగాల నుంచి ఈ బ్రిగేడ్ విముక్తి కల్పించింది.
15 ఏళ్ల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని ఒకరు భారత్‌లో పర్యటిస్తున్నారు. 2003లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షరన్ భారత్‌లో పర్యటించారు. ఆరు నెలల క్రితం ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో ఆ దేశంతో సంబంధాలు బలపడ్డాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరిగాక ఆ దేశంలో పర్యటించిన తొలి ప్రధాని మోదీనే.
భారత్ - ఇజ్రాయెల్ మధ్య 9 ఒప్పందాలు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరు రోజుల భారత పర్యటనలో భాగంగా జనవరి 16న ఢిల్లీలో రైసినా డైలాగ్ భౌగోళిక-రాజకీయ మూడో సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇస్లాం అతివాదం, ఉగ్రవాదుల చర్యలు అంత్యంత ప్రమాదకరమైనవనీ, అంతర్జాతీయ వ్యవస్థపై ఇవి తీవ్ర దుష్పరిణామాలు చూపగలవని నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు భారత్-ఇజ్రాయెల్ మధ్య మరింత బలమైన బంధం ఉండాలని ఆయన పేర్కొన్నారు.
భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక చర్చల సందర్భంగా జనవరి 15న ఇరు దేశాల మధ్య సైబర్ భద్రత, గ్యాస్, ఆయిల్ తదితర రంగాల్లో మొత్తం 9 ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల అధికారులు వీటిపై సంతకాలు చేశారు. అలాగే ఢిల్లీలో జనవరి 15న జరిగిన ఇండియా-ఇజ్రాయెల్ వాణిజ్య సదస్సులో మోదీ మాట్లాడుతూ కంపెనీలు తమ వ్యాపారాన్ని మరింత అబివృద్ధి చేసుకునేందుకు భారత్‌లో అపార అవకాశాలున్నాయన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ - ఇజ్రాయెల్ మధ్య 9 ఒప్పందాలు
ఎప్పుడు : జనవరి 15
ఎవరు : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటనలో భాగంగా
స్పైక్ క్షిపణుల కొనుగోలు ఒప్పందం రద్దు
ఇజ్రాయెల్‌కు చెందిన ఆయుధాల కంపెనీ రాఫెల్ అడ్వాన్‌స డిఫెన్‌స సిస్టమ్స్‌తో యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే క్షిపణుల (స్పైక్) కొనుగోలు ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. 1,600 క్షిపణుల కోసం జరిగిన ఈ ఒప్పందం విలువ రూ.3 వేల కోట్లు. ఈ మేరకు ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు భారత్ రక్షణ శాఖ నుంచి అధికారిక సమాచారం అందిందని రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రతినిధి వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇజ్రాయెల్ కంపెనీతో స్పైక్ క్షిపణుల కొనుగోలు ఒప్పందం రద్దు
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : భారత ప్రభుత్వం
ఆసియాన్-ఇండియా రౌండ్ టేబుల్ సమావేశం
ఆసియాన్-ఇండియా నెట్‌వర్క్ మేధావుల ఐదవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ జనవరి 6న జకర్తాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సమష్టి భద్రత, సమష్టి సంపద’ అనే రెండు సూత్రాల ఆధారంగా ఆసియాన్ దేశాల మధ్య ప్రాంతీయ సహకారాన్ని ఆకాంక్షించారు. ఆసియాన్ దేశాలు.. దృఢ, గతిశీల ఆర్థిక బంధాలను కలిగి ఉండాలన్నారు. ఈ దిశగా నౌకాయాన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంస్కృతిక వారసత్వ సంబంధాలను పెంపొందించుకోవాలన్నారు.
ఆసియాన్-ప్రవాసీ భారతీయ దివస్
సింగపూర్‌లో జనవరి 7న జరిగిన ఆసియాన్-ప్రవాసీ భారతీయ దివస్ సదస్సులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. సదస్సులో ప్రసంగించిన ఆమె.. ఆసియాన్ కూటమితో భారత్ దృఢ బంధం ఏర్పరచుకోవడంలో ప్రవాస భారతీయులు అద్భుత వేదికగా నిలిచారన్నారు.
ఎవరెస్టు ఎత్తు కొలవాలనే భారత్ ప్రతిపాదన తిరస్కరణ
నేపాల్‌తో కలసి సంయుక్తంగా ఎవరెస్ట్ శిఖరం ఎత్తును కొలిచేందుకు భారత్ పంపిన ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. ఎవరెస్ట్ ఎత్తును తామే కొలుస్తామని.. భారత్, చైనాలు కేవలం కీలకమైన గణాంకాలను అందిస్తే చాలని నేపాల్ సర్వే విభాగం ఈ మేరకు స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం వెనుక చైనా హస్తం ఉండి ఉంటుందని భారత్ భావిస్తోంది.
2015 నాటి‘గోర్ఖా భూకంపం నేపాల్‌ను కుదిపేసింది. ఈ విలయం తర్వాత ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ సర్వే డిపార్ట్ మెంట్ తో కలసి ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు సర్వే ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు పంపింది. నేపాల్ మాత్రం నిర్మోహమాటంగా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. నేపాల్ ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చి చైనా ఈ పని చేయించి ఉంటుందని భారత్ అధికారులు అంటున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు భారత్ పంపిన ప్రతిపాదనలు తిరస్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : నేపాల్

Published date : 05 Jan 2018 03:08PM