ఏప్రిల్ 2019 ద్వైపాక్షిక సంబంధాలు
Sakshi Education
నియంత్రణ రేఖ వాణిజ్యం రద్దు
జమూకశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్ మధ్య నడుస్తున్న నియంత్రణరేఖ వాణిజ్యాన్ని ఏప్రిల్ 19 నుంచి రద్దుచేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ వాణిజ్యమార్గం ద్వారా పాకిస్థాన్‌కు చెందిన అవాంఛనీయ శక్తులు, జాతి వ్యతిరేకులు వాణిజ్యం పేరుతో హవాలా డబ్బు, డ్రగ్‌స, ఆయుధాలను సరిహద్దులను దాటిస్తుండంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నియంత్రణ రేఖకు ఇరువైపులా ఉన్న స్థానిక ప్రజల ఉత్పత్తుల మార్పిడికి అనువైన వాతావరణ కల్పించడానికి ప్రభుత్వం ఇక్కడ వాణిజ్యానికి అనుమతిచ్చింది. ప్రస్తుతం బారాముల్లా జిల్లాలోని సలాంబాద్; పూంచ్ జిల్లాలోని చక్కన్ దా బాగ్ వద్ద ఉన్న రెండు వాణిజ్య కేంద్రాల ద్వారా వారంలో నాలుగు రోజుల పాటు వ్యాపార లావాదేవీలు జరుగుతూవస్తున్నాయి. డబ్బుతో సంబంధంలేకుండా పూర్తి వస్తుమార్పిడి పద్ధతిలో వాణిజ్యం జరుగుతున్నందున ఎలాంటి సుంకాలు విధించడంలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమూకశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్ మధ్య నడుస్తున్న నియంత్రణరేఖ వాణిజ్యం రద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : వాణిజ్యం పేరుతో హవాలా డబ్బు, డ్రగ్స్, ఆయుధాలను సరిహద్దులను దాటిస్తున్నందుకు
సీపీఈసీ కేవలం ఆర్థిక అంశం మాత్రమే
చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ) నిర్మాణం కేవలం ఆర్థికపరమైన అంశమేనని, ఏదైనా దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఈ కారిడార్ లక్ష్యంగా చేసుకోదని ఏప్రిల్ 19న చైనా స్పష్టం చేసింది. ఏప్రిల్ 25 నుంచి 27 వరకు చైనా రాజధాని బీజింగ్‌లో బీఆర్‌ఎఫ్ సదస్సుని నిర్వహించనున్న నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఈ మేరకు వ్యాఖ్యానించారు. సీపీఈసీకు కశ్మీర్ సమస్య పట్ల ఎటువంటి నిర్లక్ష్య ధోరణి లేదని తెలిపారు. బీఆర్‌ఎఫ్‌లో 37 దేశాల అగ్ర నేతలు, 150 దేశాల ప్రతినిధులు, 90 అంతర్జాతీయ సంస్థలతో కలిసి మొత్తం 5,000 మంది పాల్గొననున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీపీఈసీ కేవలం ఆర్థిక అంశం మాత్రమే
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : చైనా
ఇండోనేషియాలో రామాయణ స్టాంపు విడుదల
ఇండోనేషియాలో రామాయణ ఇతివృత్తంతో ప్రత్యేక స్టాంపును విడుదల చేశారు. భారత్-ఇండోనేషియా మధ్య 70 ఏళ్ల దౌత్య సంబంధాలను పురస్కరించుకొని ఏప్రిల్ 24న ఇండినేషియా ప్రభుత్వం ఈ స్టాంపును విడుదల చేసింది. రామాయణంలో సీతను రావణుడి బారి నుంచి రక్షించేందుకు జటాయువు చేసిన పోరాటాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఈ స్టాంపును రూపొందించారు. ప్రముఖ ఇండోనేషియా శిల్పకారుడు పద్మశ్రీ బాపక్ న్యోమన్ నుఅర్తా ఈ స్టాంపును రూపొందించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామాయణ స్టాంపు విడుదల
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : ఇండోనేషియా ప్రభుత్వం
ఎక్కడ : ఇండోనేషియా
ఎందుకు : భారత్-ఇండోనేషియా మధ్య 70 ఏళ్ల దౌత్య సంబంధాలను పురస్కరించుకొని
జలియన్‌వాలాబాగ్ దురంతం అవమానకరం
1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్‌వాలాబాగ్ దురంతం బ్రిటిష్ పాలనలోని భారత చరిత్రలో అవమానకర మరకగా మిగిలిపోతుందని బ్రిటన్ ప్రధాని థెరిసా మే అన్నారు. 2019, ఏప్రిల్ 13న జలియన్‌వాలాబాగ్ ఘటనకు వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్లమెంట్‌లో చర్చలో ఆమె ఈ మేరకు మాట్లాడారు. ఈ ఘటనపై అధికారికంగా క్షమాపణ చెప్పడానికి ఆమె నిరాకరించారు.
స్వాతంత్య్రపోరాటంలో భాగంగా భారతీయులు రహస్యంగా సమావేశమైనప్పుడు జనరల్ డయ్యర్ నేతృత్వంలోని సేనలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 379 మంది చనిపోగా, 1200 మంది గాయపడ్డారు.
స్ట్ట్రాటజిక్ రిలేషన్‌షిప్ బిల్లు ప్రవేశపెట్టిన అమెరికా
అమెరికా దేశ ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌స)లో యూఎస్-ఇండియా స్ట్రెటజిక్ రిలేషన్‌షిప్ బిల్లును అమెరికా చట్టసభ సభ్యుల బృందం పునఃప్రవేశపెట్టింది. హెచ్‌ఆర్- 2123 పేరిట రూపొందించిన ఈ బిల్లును కాంగ్రెస్ సభ్యుడు జో విల్సన్ సభలో ప్రవేశపెట్టారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందితే వ్యూహాత్మక ఆయుధాల విక్రయంలో భారత్‌కు ప్రాధాన్యం లభిస్తుంది. అలాగే అమెరికా నేతృత్వంలోని నాటో సభ్య దేశాలైన ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్‌లతో సమాన హోదా లభిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా దేశ ప్రతినిధుల సభ స్ట్ట్రాటజిక్ రిలేషన్‌షిప్ బిల్లు
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జో విల్సన్
ఎందుకు : భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు
భారత్ వంద శాతం టారిఫ్‌లు విధిస్తోంది : అమెరికా
భారత్ పలు అమెరికా ఉత్పత్తులపై 100 శాతం పైగా టారిఫ్‌లు విధిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయితే అవే ఉత్పత్తులు లేదా ఆ కోవకి చెందిన ఇతరత్రా ఉత్పత్తులపై అమెరికా ఎటువంటి సుంకాలను విధించడం లేదని పేర్కొన్నారు. భారత్ ’టారిఫ్‌ల కింగ్’ అని, అత్యధికంగా సుంకాలు విధించే దేశాల్లో ఒకటని కొంతకాలంగా ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నారు.
భారత్‌పై డబ్ల్యూటీవోకి ఈయూ ఫిర్యాదు
భారత్ అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను భారత్ ఉల్లఘించిందని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఏప్రిల్ 2న ఫిర్యాదు చేసింది. మొబైల్ ఫోన్స్ సహా ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)కి సంబంధించిన కొన్ని ఉత్పత్తులపై భారత్ నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి సుంకాలను విధిస్తోందని ఈయూ తన ఫిర్యాదులో ఆరోపించింది. ఐసీటీ ఉత్పత్తులపై సుంకాలను విధించబోమన్న హామీకి భారత్ కట్టుబడి ఉండాలని కోరుతున్నట్లు ఈయూ కమిషనర్ ఫర్ ట్రేడ్ సిసీలియా మామ్‌ో్టమ్ ్రపేర్కొన్నారు.
కరెంటు అకౌంటు లోటు పెరిగిపోకుండా దిగుమతులను కట్టడి చేసే క్రమంలో 2018, అక్టోబర్‌లో భారత ప్రభుత్వం కొన్ని కమ్యూనికేషన్స్ ఉత్పత్తులపై సుంకాలను 20 శాతం దాకా పెంచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌పై డబ్ల్యూటీవోకి ఫిర్యాదు
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : యూరోపియన్ యూనియన్ (ఈయూ)
ఎందుకు : అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను ఉల్లఘించిందని
భారత్‌కు ఎంహెచ్60ఆర్ హెలికాప్టర్లు
భారత్‌కు 24 ఎంహెచ్ 60ఆర్ సీహాక్ హెలికాప్టర్లను విక్రయించేందుకు అమెరికా ఏప్రిల్ 3న ఆమోదం తెలిపింది. శత్రు దేశాల సబ్‌మెరైన్లు, నౌకలను ధ్వంసం చేసేందుకు, సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించి రక్షించేందుకు వీలుగా ఈ హెలికాప్టర్లను రూపొందించారు. యుద్ధనౌకలు, విధ్వంసక నౌకలు, క్రూజర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ల నుంచి ఈ హెలికాప్టర్లను ప్రయోగించవచ్చు. 24 హెలికాప్టర్లకు మొత్తంగా ధర రూ.1.78 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.
సీహాక్ హెలికాప్టర్ల ప్రత్యేకతలు...
ఏమిటి : భారత్‌కు సీహాక్ హెలికాప్టర్లను విక్రయించేందుకు ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : అమెరికా

- అమెరికాలో ఎంహెచ్ 60ఆర్ సీహాక్ హెలికాప్టర్లను ‘రోమియో’అని కూడా పిలుస్తారు.
- లాక్‌హీడ్ మార్టిన్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ (ఓవిగో) సంస్థ ఈ హెలికాప్టర్లను తయారుచేసింది. 2001, జూలైలో తొలి హెలికాప్టర్ తయారైంది.
- - ఈ హెలికాప్టర్లలో సబ్‌మెరైన్లను ధ్వంసం చేసే పరికరాలతో పాటు సర్చ్, రెస్క్యూ, గన్ సపోర్ట్, నిఘా, సమాచారం చేరవేసే సాంకేతికతను అనుసంధానం చేశారు.
- ఈ హెలికాప్టర్ల ద్వారా సరుకులు, వ్యక్తులను తరలించే వెసులుబాటు ఉంది.
ఏమిటి : భారత్‌కు సీహాక్ హెలికాప్టర్లను విక్రయించేందుకు ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : అమెరికా
Published date : 19 Apr 2019 06:20PM