Skip to main content

డిసెంబరు 2018 ద్వైపాక్షిక సంబంధాలు

చైనా పాల దిగుమతులపై నిషేధం పొడిగింపు Current Affairs
చైనా నుంచి దిగుమతి అయ్యే పాలు, పాల ఉత్పత్తులు సహా చాక్లెట్లపై ఉన్న నిషేధాన్ని మరో నాలుగు నెలల పాటు కేంద్రం ప్రభుత్వం పొడిగించింది. 2019, ఏప్రిల్ 23 దాకా ఇది వర్తిస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ డిసెంబర్ 24న వెల్లడించింది. చైనా పాల ఉత్పత్తుల్లో హానికారకమైన మెలామిన్ (ప్లాస్టిక్స్.. ఎరువుల్లో ఉపయోగించే విషపూరిత రసాయనం) దాఖలాలు ఉన్నాయన్న ఆందోళనతో తొలిసారిగా 2008లో నిషేధం విధించారు. గతంలో విధించిన నిషేధం కాలవ్యవధి డిసెంబర్ 23 నాటికి తీరిపోయింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
చైనా పాల దిగుమతులపై నిషేధం పొడిగింపు
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎక్కడ : భారత్

మాల్దీవులకు భారత్ 10వేల కోట్ల సాయం
మాల్దీవులకు భారత్ రూ. 10 వేల కోట్లు సాయం అందించనుంది. చైనా నుంచి తీసుకున్న రుణాల భారంతో సతమతమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్‌తో డిసెంబర్ 17న మోదీ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ద్వైపాక్షికం సంబంధాలు బలోపేతం చేసుకోవాలని, హిందూమహా సముద్ర ప్రాంతంలో భద్రతను మరింత పెంచేందుకు సహకరించుకోవాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. మొత్తం నాలుగు ఒప్పందాలపై మోదీ, సోలిహ్ సంతకాలు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మాల్దీవులకు 10వేల కోట్ల సాయం
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : భారత్

అమెరికా రక్షణ మంత్రితో నిర్మలా సమావేశం
Current Affairs అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్‌తో భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అమెరికాలోని పెంటగాన్‌లో డిసెంబర్ 4న సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా రక్షణ, భద్రతా సంబంధాల వంటి విషయాలపై ఇరు దేశాల మంత్రులు చర్చలు జరిపారు. రక్షణ రంగంలో అమెరికాను భారత్ ముఖ్యమైన భాగస్వామిగా పరిగణిస్తోందని నిర్మలా ఈ సందర్భంగా అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా రక్షణ మంత్రితో భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ సమావేశం
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎక్కడ : పెంటగాన్ , అమెరికా
Published date : 15 Dec 2018 11:53AM

Photo Stories