డిసెంబర్ 2019 ద్వైపాక్షిక సంబంధాలు
Sakshi Education
మెరుగ్గా భారత్-చైనా సైనిక బంధం: పీఎల్‌ఏ
వ్యూహాత్మక చర్చలు, ఆచరణాత్మక సహకారం వల్లే భారత సైన్యంతో సంబంధాలు మెరుగుపడ్డాయని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) తెలిపింది. ఇందుకు కృషి చేసిన ప్రధాని మోదీ, అధ్యక్షుడు జిన్‌పింగ్‌లకు కృతజ్ఞతలు తెలిపింది. డిసెంబర్ 26న చైనా రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ వూ క్వియాన్ మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా భారత్‌లో ముగిసిన సంయుక్త ఉగ్ర వ్యతిరేక విన్యాసాలు ప్రాంతీయ స్థిరత్వం, ఉగ్రపోరుపై ఇరు దేశాలు కృతనిశ్చయంతో ఉన్నట్లు చాటిచెప్పాయన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత సైన్యంతో సంబంధాలు మెరుగుపడ్డాయి
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)
సీఏఏపై కాంగ్రెషనల్ రీసెర్చి సర్వీస్ నివేదిక
భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్పీఆర్)పై అమెరికాకు చెందిన కాంగ్రెషనల్ రీసెర్చి సర్వీస్(సీఆర్‌ఎస్) నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ఆ దేశ కాంగ్రెస్ సభ్యులకు అందజేసింది. సీఆర్‌ఎస్ అనేది అమెరికా కాంగ్రెస్‌కు చెందిన స్వతంత్య్ర అధ్యయన విభాగం. ప్రాముఖ్యత సంతరించుకున్న దేశీయ, అంతర్జాతీయ అంశాలపై అధ్యయనం చేసి ఈ కమిటీ కాంగ్రెస్ సభ్యులకు నివేదికలు సమర్పిస్తుంటుంది. అయితే వీటిని కాంగ్రెస్ అధికారిక నివేదికలుగా మాత్రం పరిగణించదు.
సీఆర్‌ఎస్ నివేదికలోని అంశాలు
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్పీఆర్)పై నివేదిక
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : కాంగ్రెషనల్ రీసెర్చి సర్వీస్(సీఆర్‌ఎస్)
అమెరికా అధ్యక్షుడితో రాజ్‌నాథ్, జైశంకర్‌లు భేటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో డిసెంబర్ 20న జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అలాగే వాణిజ్య అంశాలపై చర్చ జరిగినట్లు మంత్రి జైశంకర్ తెలిపారు.
మరోవైపు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, డిఫెన్స్ సెక్రటరీ మైక్ ఎస్పర్‌లతో రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ... భారత్ నుంచి వస్తున్న ప్రతిభావంతులను అడ్డుకోరాదని అమెరికాకు సూచించారు. ఇరు దేశాల మధ్య వారి సేవలు వ్యూహాత్మక వారధిగా పనిచేస్తాయని, ఆర్థిక సహకారంలోనూ ఇది ముఖ్యమైన భాగమని స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్
ఎక్కడ : వైట్‌హౌస్, అమెరికా
ఎందుకు : ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు
సరిహద్దు వివాదంపై భారత్, చైనా చర్చలు
దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలను వేగవంతం చేయాలని భారత్, చైనాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకుని పురోగతే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించాయి. సరిహద్దు వివాదంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మధ్య 22వ దఫా చర్చలు ఢిల్లీలో డిసెంబర్ 21న జరిగాయి.
ఈ భేటీ విషయమై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ... ‘భారత్-చైనా వ్యూహాత్మక సంబంధాల కోణంలో సరిహద్దు సమస్యను చూడాలని, సరిహద్దుల్లో శాంతి నెలకొల్పాలని ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాయి. భారత్-చైనాల సంబంధాల్లో సుస్థిర, సమతులాభివృద్ధి ఈ ప్రాంతంతోపాటు ప్రపంచ శాంతి, అభివృద్ధికి సానుకూలంగా మారుతుందనే అభిప్రాయాన్ని ఈ ప్రత్యేక ప్రతినిధుల భేటీ వ్యక్తం చేసింది’అని తెలిపింది.
చైనాలో 23వ దఫా భేటీ
సరిహద్దు వివాదంపై చర్చించేందుకు వాంగ్, దోవల్‌ను రెండు దేశాలు ప్రత్యేక ప్రతినిధులుగా నియమించాయి. 2020 ఏడాది చైనాలో 23వ దఫా భేటీ కావాలని కూడా ఇద్దరు ప్రతినిధులు నిర్ణయించారు. భారత్-చైనాల మధ్య 3,488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖపై వివాదం నలుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు టిబెట్ దక్షిణ ప్రాంతం కూడా తనదేనని చైనా వాదిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సరిహద్దు వివాదంపై భారత్, చైనా చర్చలు
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : చెనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
ఎక్కడ : న్యూఢిల్లీ
హైదరాబాద్‌లో కజికిస్తాన్ కాన్సులేట్ కార్యలయం
కజికిస్తాన్ దేశానికి సంబంధించిన కాన్సులేట్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశ రాయబారి యెర్లాన్ అలింబాయేవ్ వెల్లడించారు. ఎంఏకే ప్రాజెక్ట్స్ ఎండీ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్‌ను గౌరవ కాన్సూల్ జనరల్‌గా నియమించనున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 12న హైదరాబాద్‌ను తొలిసారిగా సందర్శించిన ఆయన ఈ మేరకు వెల్లడించారు.
గవర్నర్ తమిళిసైతో భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో కజికిస్తాన్ రాయబారి యెర్లాన్ అలింబాయేవ్ డిసెంబర్ 12న భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ, కజికిస్తాన్ మధ్య సంబంధాలను మరింత మెరుగుపర్చేందుకు గల అవకాశాల గురించి చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కజికిస్తాన్ కాన్సులేట్ కార్యలయం ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : కజికిస్తాన్ యబారి యెర్లాన్ అలింబాయేవ్
ఎక్కడ : హైదరాబాద్
జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు
జపాన్ ప్రధాని షింజో ఆబే భారత పర్యటన రద్దయింది. పౌరసత్వ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల కారణంగా గువాహటి(అస్సాం)లో ప్రధాని నరేంద్ర మోదీతో 2019, డిసెంబర్ 15 నుంచి జరగాల్సిన భేటీ రద్దయినట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది.
రణరంగంగా జామియా వర్సిటీ
పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో డిసెంబర్ 13న నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే, గత రెండు రోజులతో పోలిస్తే.. అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొంత తగ్గుముఖం పట్టాయి. కానీ ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం రణరంగంగా మారింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జపాన్ ప్రధాని షింజో ఆబే భారత పర్యటన రద్దు
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎందుకు : పౌరసత్వ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల కారణంగా
భారత్-అమెరికా 2+2 చర్చలు ప్రారంభం
భారత్-అమెరికాల మధ్య 2+2 ఉన్నత స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో డిసెంబర్ 18న అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్‌పాంపియో, డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పర్‌లతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. వీరు ద్వైపాక్షిక, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-అమెరికా 2+2 చర్చలు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : ద్వైపాక్షిక, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించేందుకు
అమిత్ షాపై ఆంక్షలు విధించాలి : యూఎస్‌సీఐఆర్‌ఎఫ్
పౌరసత్వ సవరణ బిల్లు-2019ను యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) తప్పు పట్టింది. ఈ బిల్లు తప్పుడు మార్గంలో వెళుతూ అత్యంత ప్రమాదకరంగా మారిందని వ్యాఖ్యానించింది. భారత లౌకికతత్వాన్ని ఈ బిల్లు దెబ్బ తీస్తోందని, సమాన హక్కుల్ని కాలరాస్తోందని పేర్కొంది. మత ప్రాతిపదికన చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న భారత హోం మంత్రి అమిత్, ఇతర నాయకులపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిగణించాలని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి డిసెంబర్ 10న సూచించింది.
కనీస అవగాహన లేదు : భారత్
పౌరసత్వ సవరణ బిల్లు-2019పై కనీస అవగాహన లేకుండా యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ సూచనలు చేస్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. ఈ అంశంలో ఆ సంస్థ ఈర్ష్య, పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఎదురు దాడికి దిగారు. ఆంక్షలు విధించాలంటూ సిఫార్సులు చేయడం అత్యంత విచారకరమన్న రవీష్ కుమార్ భారత్‌లో చట్టాలపై వ్యాఖ్యలు చేసే హక్కు ఆ సంస్థకు లేదని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత హోం మంత్రి అమిత్ షాపై ఆంక్షలు విధించాలి
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్)
ఎందుకు : పౌరసత్వ సవరణ బిల్లు-2019ను వ్యతిరేకిస్తూ
శ్రీలంకకు 3,230 కోట్ల రుణ సాయం : మోదీ
శ్రీలంక అభివృద్ధికి, ఉగ్రవాదం అణచివేతకు 450 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,229 కోట్ల) సులభతర రుణం సాయం (లైన్ ఆఫ్ క్రెడిట్) చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇందులో తీవ్రవాద నిర్మూలనకు 50 మిలియన్ డాలర్లు (రూ.358 కోట్లు) కేటాయించారు. శ్రీలంక నూతన అధ్యక్షుడు గోతబయ రాజపక్సతో నవంబర్ 29న ఢిల్లీలో సమావేశమైన సందర్భంగా మోదీ ఈ రుణాన్ని ప్రకటించారు.
మోదీ, గోతబయ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, శ్రీలంకలోని మైనారిటీ తమిళుల ఆకాంక్షలూ, భద్రతాంశాలూ, వ్యాపార ఒప్పందాలూ, మత్స్యకారుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు శ్రీలంక పోలీసు అధికారులు భారత్‌లో శిక్షణ పొందుతున్నట్టు వెల్లడించారు. గోతబయ మాట్లాడుతూ.. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలవంతమయ్యాయనీ, ఆర్థిక సహకారం అంశాన్ని కూడా భారత ప్రధానితో చర్చించానని చెప్పారు. శ్రీలంక చెరలో ఉన్న భారత జాలర్లందరినీ విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీలంకకు 3,230 కోట్ల రుణ సాయం
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : భారత్
ఎందుకు : శ్రీలంక అభివృద్ధికి, ఉగ్రవాదం అణచివేతకు
భారత్-జపాన్ రక్షణ, విదేశాంగ మంత్రుల సమావేశం
భారత రాజధాని నగరం న్యూఢిల్లీలో నవంబర్ 30న భారత్-జపాన్ రక్షణ, విదేశాంగ శాఖల(2+2) మంత్రులు సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జై శంకర్, జపాన్ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి తొషిమిట్సు మొటెగి, రక్షణ మంత్రి టారో కొనో పాల్గొన్నారు. ఉగ్రవాదంపై పోరాడే విషయంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) సహా అంతర్జాతీయ విభాగాలకు ఇచ్చిన హామీలను పాకిస్తాన్ అమలు చేయాలని భారత్, జపాన్ ఆ దేశాన్ని కోరాయి.
మోదీతో సమావేశం
2+2 సమావేశం అనంతరం జపాన్ మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇండో-పసిఫిక్‌లో శాంతి, సుస్థిరతలను నెలకొల్పేందుకు జపాన్, భారత సంబంధాలు కీలకమైనవని ఈ సందర్భంగా మోదీ అన్నారు. 2020, జనవరిలో ఇండో-జపాన్ వార్షిక సదస్సుకు ప్రధాని షింజో ఆబేను ఆహ్వానించనున్నట్లు మోదీ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-జపాన్ రక్షణ, విదేశాంగ మంత్రుల సమావేశం
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : రాజ్‌నాథ్, జై శంకర్, జపాన్ విదేశాంగ మంత్రి తొషిమిట్సు మొటెగి, రక్షణ మంత్రి టారో కొనో
ఎక్కడ : న్యూఢిల్లీ
ఢిల్లీలో భారత్ - స్వీడన్ వ్యాపార సదస్సు
దేశ రాజధాని నగరం ఢిల్లీలో డిసెంబర్ 3న భారత్ - స్వీడన్ వ్యాపార సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... భారత్‌లో తయారీ కోసం, పెట్టుబడులకు భారత్‌ను ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా పేర్కొన్నారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు సహా ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేశారు. భారత్‌లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలంటూ స్వీడన్‌కు చెందిన కంపెనీలను మంత్రి ఆహ్వానించారు.
కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ 2019, సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గడిచిన 28 ఏళ్లలో పన్నుల పరంగా ఇది అతిపెద్ద సంస్కరణ.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ - స్వీడన్ వ్యాపార సదస్సు
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

- సీఏఏ చట్టాన్ని, ఎన్పీఆర్‌తో కలిపి అమలు చేయడం వల్ల భారత్‌లోని ముస్లిం వర్గంపై ప్రభావం పడే అవకాశం ఉంది.
- భారత చరిత్రలో తొలిసారి మతం ఆధారంగా పౌరసత్వం కల్పిస్తున్నారు.
- 955 నాటి పౌరసత్వ సవరణ చట్టానికి పలు సార్లు సవరణలు చేశారని.. కానీ ఎప్పుడూ మతాన్ని ప్రాతిపదికగా తీసుకోలేదు.
- తాజా సవరణ భారత రాజ్యాంగంలో అధికరణ 14, 15ని సవాల్ చేసేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Published date : 31 Dec 2019 04:46PM