అక్టోబర్ 2018 ద్వైపాక్షిక సంబంధాలు
Sakshi Education
జపాన్ పర్యటనలో ప్రధాని మోదీ
భారత్-జపాన్ 13వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 27న జపాన్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని షింజో అబేతో బేటీ అయిన మోదీ అనధికారిక చర్చలు జరిపారు. రోబోల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎఫ్‌ఏఎన్‌యూసీ పరిశ్రమను ఇరు దేశాధినేతలు సందర్శించారు. జపాన్‌లోని అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ ఫుజి ఆవరించి ఉన్న తన విడిది గృహంలో అబే ప్రధాని మోదీకి అక్టోబర్ 28న విందు ఇచ్చారు. ఈ గౌరవం పొందిన తొలి విదేశీ నేత మోదీనే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జపాన్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎక్కడ : జపాన్
ఎందుకు : భారత్-జపాన్ 13వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు
జపాన్ ప్రధానితో మోదీ భేటీ
భారత్-జపాన్ 13వ ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని షింజో అబేతో మరోసారి భేటీ అయ్యారు. జపాన్ రాజధాని టోక్యోలో అక్టోబర్ 29న జరిగిన ఈ భేటీలో ఆర్థిక, రక్షణ, ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, జపాన్ ఆర్థిక సాయంతో నిర్మిస్తున్న ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు సహా పలు అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. అలాగే వివిధ రంగాలకు సంబంధించిన ఆరు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. భారత్, జపాన్‌ల విదేశాంగ, రక్షణ మంత్రులతో కూడిన 2+2 చర్చలు జరపాలని మోదీ, అబే నిర్ణయించారు. అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత సభ్యత్వానికి జపాన్ మద్దతు తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-జపాన్ 13వ ద్వైపాక్షిక సమావేశం
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ-జపాన్ ప్రధాని షింజో అబే
ఎక్కడ : టోక్యో, జపాన్
ఇటలీ ప్రధాని కాంటేతో మోదీ సమావేశం
ఒక్క రోజు భారత పర్యటనకు వచ్చిన ఇటలీ ప్రధాని గిసెప్ కాంటేతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 30న సమావేశం అయ్యారు. సమావేశంలో భాగంగా ప్రాంతీయ, జాతీయ అంతర్జాతీయ అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత విసృ్తతం చేసుకోవాలని మోదీ-కాంటే నిర్ణయించారు.
మరోవైపు న్యూఢిల్లీలో అక్టోబర్ 30న జరిగిన కేంద్ర శాస్త్ర- సాంకేతిక శాఖ (డీఎస్టీ)-సీఐఐ ఇండియా- ఇటలీ టెక్నాలజీ సమిట్‌లో ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని గిసెప్ కాంటే పాల్గొన్నారు. సామాజిక న్యాయం, సాధికారత, పారదర్శకత, సమ్మిళితం సాధించేందుకు భారత్ సాంకేతికతను మాధ్యమంగా ఉపయోగించుకుంటోందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇటలీ ప్రధానితో భారత ప్రధాని సమావేశం
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : గిసెప్ కాంటే-నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
శ్రీలంక ప్రధానితో మోదీ భేటీ
భారత పర్యటనలో ఉన్న శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేతో ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 20న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలతో పాటు పలు అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. అలాగే 2017 మేలో మోదీ శ్రీలంకకు వెళ్లిన సందర్భంగా ప్రకటించిన పలు ప్రాజెక్టులను ఇరు దేశాధినేతలు సమీక్షించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎక్కడ : న్యూఢిల్లీ
భారత్‌కు బరాక్ -8 క్షిపణి వ్యవస్థ
భారత్‌కు బరాక్-8 క్షిపణి వ్యవస్థ, క్షిపణి పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఇజ్రాయెల్‌కి చెందిన ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ)తో భారత్ అక్టోబర్ 24న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.5,683 కోట్లుగా ఉంది. దీంతో భారత నావికాదళానికి బరాక్ 8 (ఎస్‌ఏఎం) క్షిపణులను ఐఏఐ సరఫరా చేయనుంది. భారత్, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధిపరిచాయి. గగన, సముద్ర, భూతలం నుంచి వచ్చే ప్రమాదాలను ఈ క్షిపణి వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంటుంది. ఈ వ్యవస్థలో చాలా ఆధునికమైన వ్యవస్థలను పొందుపరిచారు. డిజిటల్ రాడార్, కమాండ్, కంట్రోల్, లాంచర్లు, ఇంటర్‌సెప్టార్లు, డేటా లింక్ తదితర ఆధునిక వ్యవస్థలు ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు బరాక్ -8 క్షిపణి వ్యవస ్థ
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : ఇజ్రాయెల్
ఫ్రాన్స్ పర్యటనలో రక్షణ మంత్రి నిర్మలా
భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 12న ఫ్రాన్స్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేతో సమావేశమైన నిర్మలా ఇరు దేశాల వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతంపై చర్చించారు. మరోవైపు రఫేల్ యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని సందర్శించిన నిర్మలా విమానాల తయారీ పురోగతిని పరిశీలించారు. ఫ్రెంచ్ కంపెనీ డసో ఏవియేషన్ తయారుచేసే రఫేల్ యుద్ధ విమానాలను 2019లో భారత్‌కు సరఫరా చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫ్రాన్స్ పర్యటనలో భారత రక్షణ మంత్రి
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : నిర్మలా సీతారామన్
రష్యా నుంచి ట్రయంఫ్ క్షిపణుల కొనుగోలు
రష్యా నుంచి ఎస్-400 ట్రయంఫ్ అనే అధునాతన దీర్ఘశ్రేణి గగనతల క్షిపణులను భారత్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఢిల్లీలో అక్టోబర్ 5న జరిగిన 19వ భారత్-రష్యా ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం విలువ సుమారు 5 బిలియన్ డాలర్లుగా ఉంది.
అదే విధంగా గగన్‌యాన్ ప్రాజెక్టులో సహకారానికి సంబంధించి ఇస్రో, రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్‌లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు భారత్‌లోని అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఏఐఎం), రష్యాలోని సిరియస్‌లు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. మొత్తంగా అంతరిక్షం, రైల్వేలు, అణుశక్తి, విద్య, ఎరువులు వంటి రంగాల్లో భారత్-రష్యాల మధ్య ఎనిమిది ఒప్పందాలు కుదిరాయి.
మరోవైపు ఉగ్రవాద నెట్‌వర్క్‌ల నిర్మూలన, వాటి ఆర్థిక వనరులు, ఆయుధాల సరఫరా మూలాలను దెబ్బతీసేందుకు, ఉగ్ర నియామకాలను అడ్డుకునేందుకు కలసికట్టుగా ప్రయత్నాల్ని ముమ్మరం చేయాలని భారత్-రష్యాలు నిర్ణయించాయి. సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని ఇరు దేశాలు తప్పుబట్టాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ర ష్యా నుంచి ఎస్-400 ట్రయంఫ్ కొనుగోలు కు ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : భారత్
ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు
భారత పర్యటనలో ఉన్న ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయెవ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో అక్టోబర్ 1న చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు రక్షణ, వైద్యం, విద్య, సైన్స్, టెక్నాలజీ సహా మొత్తం 17 కీలక ఒప్పందాలు కుదర్చుకున్నారు. అలాగే ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ల కోసం సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాలని నిర్ణయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-ఉజ్బెకిస్థాన్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : నరేంద్ర మోదీ, షవ్‌కత్ మిర్జియోయెవ్
ఎక్కడ : న్యూఢిల్లీ
సునామీ బాధితుల కోసం ‘ఆపరేషన్ సముద్ర మైత్రి’
ఇండోనేషియాలోని భూకంపం, సునామీ బాధితులకు సహాయం చేయడం కోసం భారత్ ‘ఆపరేషన్ సముద్ర మైత్రి’ని అక్టోబర్ 3న ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రెండు విమానాలు, మూడు నావికాదళ ఓడల్లో సహాయసామాగ్రి, వైద్యానికి అవసరమయ్యే మందులను పంపించింది. ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో సెప్టెంబర్ 28న సంభవించిన భూకంపం, సునామీ కారణ ంగా 1,400 మందికిపైగా మృతిచెందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆపరేషన్ సముద్ర మైత్రి ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : భారత్
ఎందుకు : ఇండోనేషియాలోని భూకంపం, సునామీ బాధితులకు సహాయం చేసేందుకు

Published date : 24 Oct 2018 03:39PM