National award : చేపల ఉత్పత్తిలో రాష్ట్రానికి జాతీయ అవార్డు
Sakshi Education
మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి జాతీయ అవార్డు లభించింది.
ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) ఆధ్వర్యంలో నవంబర్ 21వ తేదీన భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ఈ అవార్డును అందజేశారు. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచి్చరాం భూక్యాలు తెలంగాణ తరఫున ఈ అవార్డును అందుకున్నారు.
Published date : 22 Nov 2021 05:42PM