భారత్‌లో యునెస్కో గుర్తించిన తొలి వారసత్వ నగరమేది?
1. వ్యవహారిక భాషోద్యమాన్ని గిడుగు వేంకట రామమూర్తి ఎప్పుడు ప్రారంభించారు?
1) 1906
2) 1911
3) 1916
4) 1921
- View Answer
- సమాధానం: 2
2. ఆల్ బెరూనీ రచన ‘కితాబ్ ఉల్ హింద్’ ఏ భాషలో ఉంది?
1) టర్కీ
2) అరబిక్
3) పర్షియన్
4) చైనీస్
- View Answer
- సమాధానం: 2
3. నవాబ్ వాజీద్ ఆలీషా ఏ నాట్యాభివృద్ధికి కృషి చేశారు?
1) కథక్
2) కథాకళి
3) మణిపురి
4) సత్రియ
- View Answer
- సమాధానం: 1
4. జతపరచండి.
నాట్యం ప్రసిద్ధులు
1. ఒడిస్సీ ఎ. నరేన్ చంద్ర బారువా
2. కథక్ బి. దర్శనాజవేరి
3. మణిపురి సి. సితారాదేవి
4. సత్రియ డి. సోనాల్ మాన్ సింగ్
1) 1–సి, 2–ఎ, 3–డి, 4–బి
2) 1–బి, 2–డి, 3–ఎ, 4–సి
3) 1–డి, 2–సి, 3–బి, 4–ఎ
4) 1–ఎ, 2–బి, 3–సి, 4–డి
- View Answer
- సమాధానం: 3
5. ఏకాంబరేశ్వర ఆలయం ఎక్కడ ఉంది?
1) బేలూరు
2) చిదంబరం
3) పూరి
4) కాంచీపురం
- View Answer
- సమాధానం: 4
6. ఆంధ్రప్రదేశ్‌లోని బేతంచర్ల దేనికి ప్రసిద్ధి ?
1) కాకతీయ దేవాలయాలు
2) ప్రాక్ చరిత్ర కాలం నాటి గుహలు
3) కవి పోతన జన్మస్థలం
4) నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి
- View Answer
- సమాధానం: 2
7. కింది వాటిలో సరైన జత ఏది?
1) మాచెల్ధేవి – నవకాశీ చిత్రకళ
2) మీరాబాయి – కృష్ణ భక్తి
3) కంచెర్ల గోపన్న – దాశరథీ శతకం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
8. ముత్యాల శాల ఎవరి ఆస్థానం?
1) శ్రీకృష్ణ దేవరాయలు
2) రెండో దేవరాయలు
3) అచ్యుత దేవరాయలు
4) అళియ రామరాయలు
- View Answer
- సమాధానం: 2
9.కలకత్తాలో మెడికల్ కాలేజీని స్థాపించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?
1) వారన్ హేస్టింగ్స్
2) కారన్ వాలీస్
3) వెల్లస్లీ
4) విలియం బెంటిక్
- View Answer
- సమాధానం: 4
10. తన రాజ్యంలో కరువును రూపుమాపడానికి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి తన ఎడమ చేతి వేళ్లను బలిగా సమర్పించింది ఎవరు?
1) సింగన
2) అమోఘవర్షుడు
3) దంతి దుర్గుడు
4) మొదటి కృష్ణుడు
- View Answer
- సమాధానం: 2
11. ‘రాజు కిరీటంలోని ప్రతిరత్నం ఘనీభవించిన రైతుల కన్నీటి బిందువులే’ అని రాసింది ఎవరు?
1) అమీర్ ఖుస్రూ
2) ఆల్ బెరూనీ
3) అబుల్ ఫజల్
4) బరౌనీ
- View Answer
- సమాధానం: 1
12.‘గురుముఖి లిపి’ని ఎవరు తయారు చేశారు?
1) గురునానక్
2) గురు అంగద్
3) గురుతేజ్ బహదూర్
4) గురుగోవింద్ సింగ్
- View Answer
- సమాధానం: 2
13. జుబిన్ మెహతా ఏ రంగానికి చెందిన వారు?
1) సంగీత రంగం
2) వైమానిక రంగం
3) వైద్య రంగం
4) చిత్ర కళా రంగం
- View Answer
- సమాధానం: 1
14. మానవ గణన యంత్రం అని ఎవరిని పిలుస్తారు?
1) సీమా బిశ్వాస్
2) వి.ఎస్. రమాదేవి
3) శకుంతలా దేవి
4) బులా చౌదరి
- View Answer
- సమాధానం: 3
15. జతపరచండి.
గ్రంథం గ్రంథకర్త
1. ఇండికా ఎ. హుయాన్ త్సాంగ్
2. ఫో.కో.కి బి. మార్కోపోలో
3. ది ట్రావెల్స్ సి. పాహియాన్
4. సి.యూ.కీ డి. మెగస్తనీస్
1) 1–ఎ, 2–బి, 3–సి, 4–డి
2) 1–సి, 2–ఎ, 3–డి, 4–బి
3) 1–డి, 2–సి, 3–బి, 4–ఎ
4) 1–బి, 2–డి, 3–ఎ, 4–సి
- View Answer
- సమాధానం: 3
16. జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత ఇందిరా గోస్వామి ఏ భాషలో రచనలు చేశారు?
1) అస్సామీ
2) ఒరియా
3) బెంగాలీ
4) కన్నడ
- View Answer
- సమాధానం: 1
17.‘రఘుపతి రాఘవ రాజారామ్....’ గేయాన్ని స్వరబద్ధం చేసిందెవరు?
1) భీమ్సేన్ జోషి
2) సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగార్
3) విష్ణుదిగంబర పలుస్కార్
4) శ్యామ శాస్త్రి
- View Answer
- సమాధానం: 3
18. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు?
1) ఏప్రిల్ 29
2) మే 27
3) జూన్ 16
4) అక్టోబర్ 19
- View Answer
- సమాధానం: 1
19. మొగల్రాజు ఫరూక్ షియర్ ధీర్ఘకాలిక వ్యాధిని నయం చేసిన ఆంగ్లేయుడు ఎవరు?
1) అక్సింగ్టన్
2) హామిల్టన్
3) జాబ్ ఛార్నాక్
4) సర్ థామస్ మన్రో
- View Answer
- సమాధానం: 2
20.కింది వాటిలో సరైన జత ఏది?
1) అరణం – కట్నం
2) కిలారులు – పశుశాలలు
3) హాలికుడు – వ్యవసాయదారుడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
21. ‘పల్నాటి వీర చరిత్ర’ను శ్రీనాథుడు ఎవరికి అంకితమిచ్చాడు?
1) చెన్నకేశవ స్వామి (మాచెర్ల)
2) కోదండ రామస్వామి ( ఒంటì మిట్ట)
3) సుబ్రమణ్యం స్వామి (మల్లాం)
4) ఆంధ్ర మహా విష్ణువు ( శ్రీకాకుళం)
- View Answer
- సమాధానం: 1
22. ‘అవ్వయార్’ అనే కవయిత్రి ఏ భాషకు చెందినవారు?
1) ఒరియా
2) కన్నడ
3) బెంగాలీ
4) తమిళం
- View Answer
- సమాధానం: 4
23. సి.పి. బ్రౌన్ స్మారక లైబ్రరీ స్థాపనలో కీలక పాత్ర పోషించిందెవరు?
1) చిలుకూరి వీర భద్ర రావు
2) తూమాటి దోణప్ప
3) జానమద్ది హనుమచ్ఛాస్త్రి
4) పి.వి. పరబ్రహ్మ శాస్త్రి
- View Answer
- సమాధానం: 3
24. కింది వాటిలో ఆంధ్రకళాకారులకు సంబంధించి సరైన జత ఏది?
1) షేక్ చిన మౌలానా – నాదస్వరం
2) యల్లా వెంకటేశ్వర రావు – మృదంగం
3) ఈమని శంకర శాస్త్రి – వీణ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
25. ‘ఆంధ్రా నైటింగేల్’ అని రవీంద్రనా«థ్ ఠాగూర్ ఎవరిని పిలిచారు?
1) ఈలపాట రఘురామయ్య
2) షేక్ నాజర్
3) ఆదిభట్ల నారాయణదాసు
4) మాదవ పెద్ది సత్యం
- View Answer
- సమాధానం: 1
26.షాజహాన్ ప్రతిరోజూ సంగీత గోష్టి నిర్వహించే భవనం ఏది?
1) ఎర్రకోట
2) దివాన్–ఇ–ఖాస్
3) దివాన్–ఇ–ఆమ్
4) ముత్యాలశాల
- View Answer
- సమాధానం: 2
27. తుస్సార్ సిల్క్ వస్త్రాల తయారీ కేంద్రం ఎక్కడ ఉంది?
1) ఒడిషా
2) రాజస్థాన్
3) గుజరాత్
4) బిహార్
- View Answer
- సమాధానం: 1
28. మొగలుల కాలంలో ఉన్న ‘సరఫ్లు’ అంటే ఎవరు?
1) భూస్వాములు
2) వడ్డీ వ్యాపారులు
3) కళాకారులు
4) బానిసలు
- View Answer
- సమాధానం: 2
29. ‘ఉర్దూ’ అనే పదం ‘ఓర్దూ’ అనే ఏ భాషా పదం నుంచి పుట్టింది?
1) పర్షియన్
2) లాటిన్
3) టర్కీ
4) గ్రీక్
- View Answer
- సమాధానం: 3
30.మొఘల్ రాజుల కాలంలో ‘తిక’ సంప్రదాయం అంటే ఏమిటి?
1) చక్రవర్తి పాదుకలను ముద్దుపెట్టుకోవడం
2) చక్రవర్తిని శారీరకంగా తూచడం
3) చక్రవర్తికి కిరీటధారణ చేయడం
4) చక్రవర్తి బొమ్మ నాణేలపై ముద్రించడం
- View Answer
- సమాధానం: 2
31. ప్రతి బౌద్ధ విహారంలో ఉంటూ కథల ద్వారా థమ్మాన్ని ప్రచారం చేసే ఉద్యోగిని ఏమంటారు?
1) ప్రాడ్వివాక్కు
2) విప్రవినోది
3) థమ్మకథిక
4) భాగదుఘ
- View Answer
- సమాధానం: 3
32. కింది వాటిలో సరైన జత ఏది?
1) పులి – ప్రాచీన చోళుల రాజ చిహ్నం
2) ధనస్సు – ప్రాచీన ఛేర రాజ చిహ్నం
3) మీనం – ప్రాచీన పాండ్యుల రాజ చిహ్నం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
33. ప్రాచీన తమిళ భాషా గ్రం«థం ‘మణిమేఖలై’ అంటే అర్థం ఏమిటి?
1) వడ్డాణం
2) గజ్జెలు
3) గాజులు
4) పచ్చలహారం
- View Answer
- సమాధానం: 1
34. కింది వాటిలో సరైన జత ఏది?
1)చక్రస్వామిదేవాలయం–స్థానేశ్వరం(హరియాణా)
2)వరదరాజస్వామి ఆలయం – కాంచీపురం (తమిళనాడు)
3) విఠలస్వామి ఆలయం – హంపి (కర్నాటక)
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
35. ఖజురహో దేవాలయ నిర్మాతలు ఎవరు?
1) సోలంకీలు
2) చందేలులు
3) పరమారులు
4) చౌహానులు
- View Answer
- సమాధానం: 3
36. అష్టాచాప్ అనే ఎనిమిది మంది శిష్యులు ఉన్న భక్తి ఉద్యమకారుడు ఎవరు?
1) నింభార్కుడు
2) వల్లభార్యుడు
3) కబీర్
4) చైతన్యుడు
- View Answer
- సమాధానం: 2
37. భగవద్గీతను మరాఠీ భాషలోకి అనువదించింది ఎవరు?
1) తుకారాం
2) ఏక్నాథ్
3) నామ్‌దేవ్
4) సమర్థ రామదాసు
- View Answer
- సమాధానం: 2
38. భారత్‌లో తొలి ఆంగ్లీకన్ చర్చి సెయింట్ మేరీస్ చర్చిని ఎక్కడ నిర్మించారు?
1) మద్రాస్
2) సూరత్
3) మచిలీపట్నం
4) బొంబాయి
- View Answer
- సమాధానం: 1
39. ‘ఆర్య సమాజం నా తల్లి, వైదిక మతం నా తండ్రి’ అన్నది ఎవరు?
1) స్వామి దయానంద సరస్వతి
2) లాలా లజపతి రాయ్
3) లాలా హన్సరాజ్
4) స్వామి శ్రద్ధానంద
- View Answer
- సమాధానం: 2
40. ‘ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోసియేషన్’ను స్థాపించిందెవరు?
1) సిస్టర్ నివేదిత
2) పండిత రమాబాయి
3) రమాబాయి రనడే
4) అనిబిసెంట్
- View Answer
- సమాధానం: 4
41.వంద అడుగుల ఎత్తు గోపురంతో బుద్ధుని బంగారు విగ్రహాన్ని హర్షుడు ఎక్కడ ప్రతిష్టించాడు?
1) ప్రయాగ
2) స్థానేశ్వరం
3) కన్యాకుబ్జం
4) వైశాలీ
- View Answer
- సమాధానం: 3
42. ‘నీలి నగరం’ అని పిలిచే నగరం ఏది?
1) జెపూర్
2) జోధ్‌పూర్
3) ఉదయ్‌పూర్
4) బికనీర్
- View Answer
- సమాధానం: 2
43.అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) జూలై 29
2) జూన్ 19
3) మే 24
4) ఆగస్టు 16
- View Answer
- సమాధానం: 1
44.‘సఫాయి కర్మచారి ఆందోళన్ ’ స్థాపకుల్లో ఒకరిని గుర్తించండి?
1) కైలాస్ సత్యార్థి
2) బిందేశ్వర్ పాఠక్
3) కమలాబెన్ గుర్జర్
4) బెజవాడ విల్సన్
- View Answer
- సమాధానం: 4
45. ’సంతార’ అనే ఆమరణ ఉపవాసదీక్ష ఏ మత ఆచారం?
1) బౌద్ధులు
2) జైనులు
3) శైవులు
4) పార్శీలు
- View Answer
- సమాధానం: 2
46. మీనాక్షి అమ్మ ఏ నాట్యానికి సేవ చేశారు?
1) మోహిని అట్టం
2) కథాకళి
3) కలరిపయట్టు
4) కథక్
- View Answer
- సమాధానం: 3
47. భారత్‌లో యునెస్కో గుర్తించిన తొలి వారసత్వ నగరమేది?
1) తిరుపతి
2) మథురై
3) అహ్మదాబాద్
4) ఉదయ్‌పూర్
- View Answer
- సమాధానం: 3
48. 1922లో భిల్ సేవా మండల్ని ఎవరు స్థాపించారు?
1) సి.ఎఫ్. ఆండ్రూస్
2) అమృత్ లాల్ విఠల్ దాస్ థక్కర్
3) డి.కె. కార్వే
4) వినోభాభావే
- View Answer
- సమాధానం: 2
49. హరిజన్ సేవక్ సంఘ్‌ను మహాత్మా గాంధీ ఎçప్పుడు స్థాపించారు?
1) 1932
2) 1934
3) 1936
4) 1941
- View Answer
- సమాధానం: 1
50. కింది వాటిలో సరైన జత ఏది?
1) వి. కోటేశ్వరమ్మ– మాంటిస్సోరీ విద్య
2) చింతకింది మల్లేశం– నేత పనివారికి ఆసు యంత్రం
3) గూడవల్లి రామబ్రహ్మం – చలన చిత్రరంగం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
51. స్వతంత్ర భారతదేశంలో బంగారు నాణేలు ప్రథమంగా (1969) ఎవరి ముఖ చిత్రంతో విడుదల చేశారు?
1) మహాత్మా గాంధీ
2) జవహర్లాల్ నెహ్రూ
3) ఇందిరా గాంధీ
4) మొరార్జీ దేశాయ్
- View Answer
- సమాధానం: 1
52.ఆంధ్ర దేశంలో వర్ధిల్లిన ఏకైక సంస్థానం ఏది?
1) కాళీపట్నం
2) బనగానపల్లె
3) మునగాల
4) వెంకటగిరి
- View Answer
- సమాధానం: 2
53. భారతదేశంలో పచ్చల సోమేశ్వరస్వామి ఆలయం ఎక్కడ ఉంది?
1) శ్రీకూర్మం (ఆంధ్రప్రదేశ్)
2) కాంచీపురం (తమిళనాడు)
3) పానగల్లు (తెలంగాణ )
4) పూరి(ఒడిషా)
- View Answer
- సమాధానం: 3
54. మున్నేరు నదిపై నిర్మించిన మోపాడు రిజర్వాయర్ ఏ జిల్లాలో ఉంది?
1) ఎస్పిఎస్సార్ నెల్లూరు
2) కర్నూలు
3) ప్రకాశం
4) చిత్తూరు
- View Answer
- సమాధానం: 3
55. ‘బొబ్బిలి బెబ్బులి’ అని ఎవరిని అంటారు?
1) రంగారావు
2) తాండ్ర పాపారాయుడు
3) తమ్మన్న దొర
4) అంబుల్ రెడ్డి
- View Answer
- సమాధానం: 2
56. ‘ఆంధ్ర దీపిక’ అనే నిఘంటువును రాసిందెవరు?
1) పరవస్తు శ్రీనివాసాచార్యులు
2) ముదిగొండ నాగలింగ శాస్త్రి
3) మామిడి వెంకయ్య
4) కావలి బొర్రయ్య
- View Answer
- సమాధానం: 3
57. నీడ గడియారం ఏ దేవాలయ సన్నిధిలో ఉంది?
1) రంగనాధ స్వామి ఆలయం (నెల్లూరు)
2) ఛాయా సోమేశ్వరాలయం (పానగల్లు)
3) సత్యన్నారాయణస్వామిఆలయం(అన్నవరం)
4) పరశురామేశ్వరాలయం (గుడిమల్లం)
- View Answer
- సమాధానం: 3
58. భారత్ వచ్చిన ఏసు శిష్యుడు సెయింట్ థామస్ ఏ ప్రాంతంలో ప్రథమంగా అడుగు పెట్టాడు?
1) క్రాంగనూర్
2) సూరత్
3) మచిలీపట్నం
4) చెన్నై
- View Answer
- సమాధానం: 1
59. ‘ఫలక్‌నుమా’ అంటే అర్థం ఏమిటి?
1) భూమిపై చందమామ
2) భూమిపై స్వర్గం
3) కాంతి పర్వతం
4) ఆకాశదర్పణం
- View Answer
- సమాధానం: 4
60. జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) జనవరి 26
2) మార్చి 16
3) ఆగస్టు 29
4) సెప్టెంబర్ 24
- View Answer
- సమాధానం: 4