Skip to main content

Bumper offer for Inter students: ఇంటర్‌ విద్యార్థులకు బంపర్‌ ఆఫర్‌

ఇంటర్‌ విద్యార్థులకు బంపర్‌ ఆఫర్‌  New Opportunity   Skilled Students Selected for Training and Hiring by Software Companies
ఇంటర్‌ విద్యార్థులకు బంపర్‌ ఆఫర్‌

విశాఖ విద్య: ఇంటర్‌తోనే ఐటీ కొలువులు దక్కించుకోవచ్చు. ఉద్యోగం చేస్తూనే పేరొందిన యూనివర్సిటీల్లో డిగ్రీ, ఆ పైకోర్సులను చదువుకోవచ్చు. హెచ్‌సీఎల్‌ టెక్‌–బీ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఇలాంటి అరుదైన అవకాశం లభించనుంది. ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కాలేజీలకే వచ్చి నైపుణ్యం గల విద్యార్థులను ఎంపిక చేసుకొని వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి, ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ కోర్సులు చేసిన వారికే ఇలాంటి అవకాశం దక్కుతుండగా, తాజాగా ఇంటర్‌ విద్యా ర్థులకు సైతం చక్కటి అవకాశం లభించనుంది.

16లోగా దరఖాస్తు చేసుకోవాలి : ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పరీక్ష రా సేందుకు అర్హులు. https://bit.ly/TechbeeGoAP వెబ్‌సైట్‌లో విద్యార్థుల పూర్తి వివరాలను నమోదు చేసి ఈ నెల 16లోగా రిజిస్ట్రేషన్‌ చేసుకో వాలి. విద్యార్థులు మూడు దశల్లో పరీక్షలు రాయాలి. అర్హత సాధించిన వారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో ఏడో నెల నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున స్టైఫండ్‌ ఇస్తారు. అనంతరం మంచి వేతనంతో కూడిన ఉద్యోగం దక్కనుంది.

Also Read :  Success Story : వంటలు చేస్తూ.. రూ.750 కోట్లు సంపాదించానిలా.. కానీ..

ఫోన్లలో పరీక్ష రాసే అవకాశం : విశాఖ జిల్లాకు చెందిన విద్యార్థులకు ఈ నెల 20న, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 22న పరీక్ష నిర్వ హించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి 11.30గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌ కాట్‌ టెస్టు పేరిట నిర్వహించే ఈ పరీక్షకు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో చదివే విద్యార్థులంతా అర్హులే.

ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు: ఇంటర్‌ బోర్డుతో హెచ్‌సీఎల్‌ టెక్‌–బీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ చేసుకున్న ఒప్పందం మేరకు విద్యార్థులకు ఇటువంటి అరుదైన అవకాశం లభించనుందని ఆర్‌ ఐవో రాయల సత్యనారాయణ చెప్పారు. ఇంటర్‌లో ఎంపీసీ, ఎంఈసీ గ్రూపు విద్యార్థులకు ఐటీ రంగంలోనూ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఒకేషనల్‌ కోర్సు లు చదివిన వారికి అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి డీపీవో విభాగంలో ఉద్యోగాలు కల్పించనున్నారు. ఎంపికై న విద్యార్థులు ఉద్యోగం చేసుకుంటూనే డి గ్రీ, ఆ పైస్థాయి కోర్సులను చదువుకోవచ్చు. కోర్సు ఫీజులో ఏడాదికి రూ.15 వేలకు తక్కువ కాకుండా హెచ్‌సీఎల్‌ కంపెనీ చెల్లించనుంది.

Published date : 06 Dec 2023 12:26PM

Photo Stories