APBIE: హాల్‌టికెట్లు ఇవ్వకపోతే ప్రిన్సిపాళ్లపై చర్యలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంటరీ్మడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి అటెండెన్సు నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులందరికీ హాల్‌టికెట్లను జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు జారీచేయాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు ఫిబ్రవరి 16న ఒక ప్రకటనలో సూచించారు.
దీనికి భిన్నంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కాలేజీల యాజమాన్యాలు హాల్‌టికెట్లను ఇవ్వడానికి నిరాకరిస్తే విద్యార్థులు, తలిదండ్రులు స్టేట్ కంట్రోల్ రూము టోల్ ఫ్రీ నంబరు 18004257635కు అన్ని రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటలలోపు ఫిర్యాదు చేయాలని సూచించారు.
చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్ పేపర్స్ | న్యూస్ | టిఎస్ ఇంటర్
Published date : 17 Feb 2023 03:50PM